‘పవర్ స్టార్‌’ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేసిన ఆర్జీవీ

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ ఇటీవలే ‘పవర్ స్టార్’ పేరిట సినిమా తీస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో పీకే, ఎమ్మెస్, ఎన్‌బీ, టీఎస్‌, ఓ రష్యన్ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీ నటిస్తారంటూ ఇటీవలే ప్రకటించిన ఆయన ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర పోస్టర్‌ను విడుదల చేశారు.

‘పవర్ స్టార్‌ సినిమాలోని ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఇదిగో.. ఈ సినిమా త్వరలోనే ఆర్జీవీ వరల్డ్‌ థియేటర్‌లో విడుదల కానుంది. జై పవర్‌ స్టార్’ అని ఆయన పోస్ట్ చేశాడు. ఎన్నికల ఫలితాల తర్వాతి కథ అని ఆ పోస్టర్‌పై ఉంది. ఈ పోస్టర్‌లో పవర్ స్టార్‌ పాత్రధారి అచ్చం పవన్‌ కల్యాణ్‌లాగే ఉంది. నలుపు రంగు టీషర్ట్‌ వేసుకుని కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు.

తాను తీస్తోన్న పవర్‌ స్టార్‌ సినిమా ఏ వ్యక్తికో చెందిన బయోపిక్ కాదని వర్మ ఇప్పటికే ప్రకటించారు. పార్టీ ప్రారంభించి, ఎన్నికల్లో ఓడిన ఓ సినీ స్టార్‌కు ఎదురైన పరిణామాల గురించి కల్పిత కథతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోందని వివరణ ఇచ్చాడు. ఈ సినిమా కథ, పాత్రధారి ఏ వ్యక్తినయినా పోలి ఉంటే అది కేవలం యాదృచ్ఛికం మాత్రమేనని ప్రకటించారు వర్మ.

CLICK HERE!! For the aha Latest Updates