HomeTelugu Trendingపవన్‌ కళ్యాణ్‌పై రామ్‌గోపాల్‌ వర్మ కామెంట్స్‌

పవన్‌ కళ్యాణ్‌పై రామ్‌గోపాల్‌ వర్మ కామెంట్స్‌

RGV tweets on pawan kalyan

వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్లు చేశారు. ఆయనని పాన్ ఇండియా స్టార్ గా చూడాలని కోరుతున్నానని వర్మ పేర్కొన్నారు. ‘పవన్ కళ్యాణ్ గారూ, ఆ రోజు సర్దార్ గబ్బర్ సింగ్ హిందీలో రిలీజ్ చెయ్యొద్దు వర్కవుట్ అవ్వదు, అని ఈ ట్విట్టర్ సాక్షిగా ఎంత మొత్తుకున్నా మీరు వినలేదు.. ఫలితం చూశారు’ ఇప్పుడు మళ్లీ చెప్తున్నా .. భీమ్లా నాయక్ ఏ మాత్రం తగ్గకుండా పాన్ ఇండియా రిలీజ్ చెయ్యండి.. పవర్ ప్రూవ్ చేయండి. ‘పుష్ప’ యే అంత చేస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయిన మీరు నటించిన ‘భీమ్లా నాయక్’ ఇంకా ఎంత కలెక్ట్ చెయ్యాలి? అని వర్మ ప్రశ్నించారు.

పాన్ ఇండియా సినిమా లాగా రిలీజ్ చేయకపోతే మీ ఫ్యాన్స్ అయిన మేమంతా బన్నీ ఫ్యాన్స్ కి ఆన్సర్ చెయ్యలేమని వర్మ చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ గురించి నా ట్వీట్స్ అన్నీ నా వోడ్కా టైంలో పెట్టాను. కానీ నేను ఇప్పుడు పెట్టిన ఈ ట్వీట్స్ నా కాఫీ టైంలో పెడుతున్నా. దీన్ని బట్టి నా సీరియస్‌నెస్ ని అర్థం చేసుకోండి అని వెల్లడించారు. ఎప్పుడో మీ తర్వాత వచ్చిన పిల్లలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా స్టార్స్ అయిపోతూ ఉంటే, మీరు ఇంకా ఒట్టి తెలుగుని పట్టుకుని వేలాడడం మీ ఫ్యాన్స్ అయిన మాకు కన్నీటి ప్రాయంగా ఉంది, దయచేసి భీమ్లా నాయక్ ని పాన్ ఇండియా తీసుకెళ్ళి మీరే సబ్కా బాప్ అని ప్రూవ్ చేయండి అని వర్మ పవన్ ను కోరారు.

ఇంటీరియర్ ఆంధ్రలో జరిగిన పుష్ప సబ్జెక్ట్ పాన్ ఇండియా సబ్జెక్ట్ అయినప్పుడు, కొమరం భీమ్, అల్లూరి లాంటి తెలుగు వీరుల సబ్జెక్ట్ పాన్ ఇండియా అయినప్పుడు, భీమ్లా నాయక్ సబ్జెక్ట్ పాన్ వరల్డ్ సబ్జెక్ట్ కాదంటారా పవన్ కళ్యాణ్ గారు??? అంటూ వర్మ ప్రశ్నించారు. అయితే వర్మ తమ అభిమాన హీరో కోసం ఇలా మాట్లాడడంతో మొదటిసారిగా పవన్ ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పవన్ ఈ విషయం మీద ఆలోచించాలని వారు కూడా కోరుతున్నారు. మరి దీనికి భీమ్లా నాయక్ టీమ్ నుంచి ఏమైనా స్పందన వస్తుందేమో చూడాలి.

వివాదంపై సునీత భర్త స్పందన

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!