సన్నీలియోన్ కండిషన్స్ తో నిర్మాతలు షాక్‌..

సన్నీలియోన్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరికి సుపరిచితమైన పేరే. పెద్దల సినిమా నుంచి బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈమె అనతికాలంలోనే టాప్ రేటింగ్ హీరోయిన్ గా ఎదిగింది. కేవలం ఒక్క బాలీవుడ్ కు మాత్రమే పరిమితం కాకుండా.. సౌత్ పైన కూడా దృష్టి పెట్టింది.

సౌత్ లో వరసగా సినిమాలు చేసేందుకు సిద్ధం అయ్యింది. తెలుగులో సినిమాలు లేకపోయినా.. అటు మలయాళం, తమిళంలో సినిమాలు చేస్తున్నది సన్నీలియోన్. మలయాళంలో మమ్ముట్టి సినిమాలో నటిస్తోంది. ఈ మూవీతో పాటు వీరమాదేవి అనే సినిమాలో కూడా ఈ అమ్మడు నటిస్తుండటం విశేషం.

ఇదిలా ఉంటె, సన్నీలియోన్ తన దగ్గరకు వచ్చే దర్శక నిర్మాతలకు ఓకండిషన్స్ పెడుతున్నది. ఆ కండిషన్స్ ఏమంటే.. తన దగ్గరకు వచ్చే నిర్మాతలు బౌండ్ స్క్రిప్ట్ తో రావాలని, అలా వస్తేనే.. అవకాశం ఉంటుందని చెప్తోంది. అంతేకాదు.. నిర్మాతలు క్రమశిక్షణతో ఉండాలని కూడా చెప్తోంది.