పుకార్లపై ‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడి ఆగ్రహం !

దర్శకుడు అజయ్ భూపతి ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా విజయంతో ఆయనకు వరుస ఆఫర్లు క్యూ కడతాయని అంతా అనుకున్నారు. కానీ ఆయన రెండవ చిత్రం మాత్రం ఇంకా మొదలుకాలేదు. మొదట రామ్ అని ఆ తరవాత బెల్లంకొండ, నితిన్ అని పలువురి పేర్లు వినబడినా ఏదీ స్టార్ట్ కాలేదు. తాజాగా కూడా నాగచైతన్యతో అజయ్ సినిమా చేస్తాడని వార్తలు పుట్టుకొచ్చాయి. వీరి పట్ల ఘాటుగా రియాక్ట్ అయిన అజయ్ భూపతి తన రెండవ సినిమా ఎప్పుడు, ఎవరితో ఎలా తీయాలో తనకు తెలుసని, పుకార్లను క్రియేట్ చేయవద్దని అన్నారు.