HomeTelugu Trendingఏక్‌ మినీ కథ నుంచి 'సామిరంగా..' సాంగ్‌ ప్రోమో

ఏక్‌ మినీ కథ నుంచి ‘సామిరంగా..’ సాంగ్‌ ప్రోమో

Saamiranga Song from Ek Mi
‘వర్షం’ డైరెక్టర్ శోభన్ కుమారుడు ‘పేపర్ బాయ్’ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏక్ మినీ కథ’. కావ్యా థాపర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శ్రద్ధాదాస్ కీలక పాత్ర పోషించారు. కొత్త దర్శకుడు కార్తీక్ రాపోలు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ స్టోరీ అందిస్తున్న ఈ చిత్రాన్ని మ్యాంగో మాస్ మీడియా వారు సమర్పిస్తున్నారు. ‘డజ్ సైజ్ మ్యాటర్?’ అంటూ వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ – టీజర్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. అలానే ‘ఈ మాయలో..’ లిరికల్ సాంగ్ కూడా మంచి స్పందన తెచ్చుకుంది. ఈ క్రమంలో మరో మినీ సింగిల్ ని రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ‘ఏక్ మినీ కథ’ చిత్రం నుంచి ‘సామిరంగా..’ అనే పాట లిరికల్ వీడియో ఏప్రిల్ 21న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా వదిలిన ఈ సాంగ్ ప్రోమో అలరోస్తోంది. ‘ఏక్ మినీ కథ’ చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేయనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!