పెళ్లి ఆలోచన లేదు .. మా అమ్మానాన్నతోనే ఉండిపోతా


టాలీవుడ్‌, కోలీవుడ్‌, మాలీవుడ్‌ల్లో సాయిపల్లవికి మంచి క్రేజ్ వుంది. పారితోషికంతో సంబంధం లేకుండా.. కేవలం కథ – పాత్రలకు మాత్రమే ప్రధాన్యత ఇస్తుంది సాయిపల్లవి. పాత్ర ఎలాంటిదైనా చాలా సహజంగా.. తేలికగా చేసేయడంలో ఆమె సిద్ధహస్తురాలు. అలాంటి సాయిపల్లవి త్వరలో పెళ్లి చేసుకోనున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే సినిమాలను ఎక్కువగా ఒప్పుకోవడం లేదనే ప్రచారం జరుగుతోంది.

తాజాగా ఈ విషయంపై స్పందించింది సాయిపల్లవి. “త్వరలో నేను పెళ్లి చేసుకోనున్నట్టుగా వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. ప్రస్తుతం నా దృష్టి అంతా కెరియర్ పైనే వుంది. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. అసలు పెళ్లి చేసుకుంటానో లేదో కూడా తెలియదు. ఎందుకంటే పెళ్లి పేరుతో తల్లిదండ్రులకు దూరం కావడం నాకు ఇష్టం ఉండదు. మా అమ్మానాన్నలు ఎక్కడ వుంటే అక్కడ .. వాళ్లతో పాటే ఉండిపోవాలని భావిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది సాయిపల్లవి.