HomeTelugu Trendingవెబ్‌సీరీస్‌లో నటించనున్న సాయిపల్లవి

వెబ్‌సీరీస్‌లో నటించనున్న సాయిపల్లవి

Sai pallavi in web series
హీరోయిన్‌ల్లో సాయి పల్లవికి ఓ ప్రత్యేకత వుంది. కథ, పాత్ర నచ్చాలి. ‘నో ఎక్స్ పోజింగ్’ వంటి కండిషన్లు కూడా పెడుతుంది. అందుకే, సాయిపల్లవి సినిమాలు మనకు తక్కువగా కనిపిస్తుంటాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది. ఒకటి నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’, మరొకటి రానా హీరోగా తెరకెక్కుతున్న ‘విరాటపర్వం’. ఇప్పుడీ బ్యూటీ తాజాగ వెబ్ సీరీస్‌లో కూడా నటించడానికి ఓకే చెప్పిందట.

ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ చేయనున్న వెబ్‌సీరీస్ లో పల్లవి నటిస్తోంది. ఇందులో ఆమె తండ్రిగా ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ నటిస్తుండడం మరో విశేషం.మామూలుగా కథ నచ్చనిదే సినిమాలే ఒప్పుకోని సాయిపల్లవి ఇప్పుడు వెబ్‌సీరీస్ చేయడానికి కూడా ఒప్పుకుందంటే, ఇది కచ్చితంగా మంచి కాన్సెప్ట్ తో వస్తున్నదే అయివుంటుందని అంటున్నారు. ఆనర్ కిల్లింగ్స్ (పరువు హత్యలు) నేపథ్యంలో ఈ సీరీస్ రూపొందుతుందని తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ నిర్మించే ఈ సీరీస్ త్వరలోనే షూటింగును ప్రారంభించనుందట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!