HomeTelugu Newsసల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ భారత్ మూవీ సాంగ్‌ టీజర్‌ చూశారా?

సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ భారత్ మూవీ సాంగ్‌ టీజర్‌ చూశారా?

11 27

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ సినిమా అంటే అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. ఈ జంటకు అభిమానుల్లో ఉన్న క్రేజ్‌ అలాంటింది. త్వరలో భారత్ చిత్రంతో సల్మాన్‌, కత్రినా అభిమానులను అలరించనున్నారు. ఈ నేపథ్యంలో సినిమాలోని చాష్నీ.. అంటూ సాగే ఓ రొమాంటిక్‌ పాట టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. టీజర్‌లో సల్మాన్‌, కత్రినా కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. మరోసారి వీరిద్దరి కెమిస్ట్రీతో అభిమానులను ఫిదా చేశారు.

భారత్ సినిమాకు అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహించారు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చినప్పట్నుంచి 70 ఏళ్ల వరకూ దేశంతో పాటే ఎదుగుతూ నిరుద్యోగం, ఆర్థిక మాంద్యం లాంటి ఆటుపోట్లను దాటుకుంటూ ఓ పరిపూర్ణ జీవితాన్ని అనుభవించిన భారత్‌ అనే వ్యక్తి కథను తెరకెక్కిస్తున్నారు. రంజాన్‌ కానుకగా జూన్‌ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!