‘నా చైతూ కోసం ఎదురుచూస్తున్నాను’ .. సమంత ట్వీట్‌

హీరోయిన్‌ సమంత.. తన భర్త నాగచైతన్యను చాలా మిస్సవుతున్నట్లున్నారు. ‘మజిలి’ సక్సెస్‌ అనంతరం సామ్‌ తన తర్వాత సినిమా చిత్రీకరణ నిమిత్తం పోర్చుగల్‌కు వెళ్లారు. మామయ్య అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న ‘మన్మథుడు 2’ సినిమాలో సామ్‌ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జున, అమల, సమంత పోర్చుగల్‌కు వెళ్లారు. సమంత పాత్ర చిత్రీకరణ అయిపోయాక స్పెయిన్‌కు వెళ్లారు. అయితే నాగ చైతన్య మాత్రం ఇక్కడే ఉన్నారు.

ఈ నేపథ్యంలో సమంత తన భర్త కోసం ఎదురుచూస్తున్నానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో పోస్ట్‌ చేశారు. బాధగా చూస్తున్న ఓ స్కెచ్‌ ఫొటోను పోస్ట్‌ చేస్తూ దానిపై ‘నా చైతూ కోసం ఎదురుచూస్తున్నాను’ అని పేర్కొన్నారు. ‘మన్మథుడు 2’ చిత్రానికి రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వెన్నెల కిశోర్‌ కీలక పాత్రను పోషించనున్నారు. ఈ సందర్భంగా చిత్రీకరణ సమయంలో నాగార్జున, వెన్నెల కిశోర్‌, రాహుల్‌తో కలిసి దిగిన ఫొటోలను కూడా సమంత పోస్ట్‌ చేశారు. ‘మన్మథుడు 2’ చిత్రంలో సమంత పాత్ర సినిమాకే కీలకంగా ఉండబోతోందని చిత్రవర్గాలు అంటున్నాయి. ఇందులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates