HomeTelugu Big Storiesఅక్కినేని కోడలి కొత్త బిజినెస్‌

అక్కినేని కోడలి కొత్త బిజినెస్‌

5 18
అక్కినేని సమంత పెళ్లి తర్వాత కూడా వరస సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అక్కినేని కోడలు అయిన తర్వాత ఎంచుకునే కథల్లో కొత్తదనం చూపిస్తుంది. హూందా ఉన్న పాత్రల్లోనే కనిపిస్తుంది ఈ బ్యూటి. తాజాగా 96 రీమేక్‌ ‘జాను’ తో పలకరించింది. ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ వచ్చినా.. కలెక్షన్స్ పరంగా మాత్రం అంతంత మాత్రం గానే ఉంది. ప్రస్తుతం సమంత.. తెలుగు దర్శక ద్వయం రాజ్ డికే తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ ఫ్యామిలీ మేన్ 2‌లో నటించింది సమంత. ఇప్పటికే సమంత అక్కినేని పాత్రకు సంబంధించిన షూటింగ్ కంప్లీటైంది. తాజాగా బిజినెస్ ఉమెన్ అయిపోవాలని ప్లానింగ్ సిద్ధం చేసుకుంటుంది అక్కినేని కోడలు. దీనికోసం స్కూలింగ్ బిజినెస్ ఎంచుకుంది స్యామ్. ప్రస్తుతం ఎడ్యుకేషనల్ బిజినెస్ ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇందులో భాగంగానే ప్రీ స్కూల్, నర్సరీ, ప్రైమరీ స్కూల్, పీపీ-2 స్కూళ్లను ఓపెన్ చేయబోతుంది. ఈ విషయాన్ని తన అభిమానులతో షేర్ చేసుకుంది సమంత. తన స్నేహితురాలు.. శిల్పారెడ్డితో పాటు ప్రముఖ విద్యావేత్త ముక్తా ఖురానాతో కలసి ఏకం అనే పేరుతో లెర్నింగ్ సెంటర్‌ను జూబ్లీ హిల్స్‌లో ప్రారంభించబోతున్నట్టు తెలిపింది. ఈ స్కూల్‌లో పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తారట. దాదాపు సంవత్సరం నుంచి ఈ స్కూల్‌కు సంబంధించిన పనులు నడుస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!