HomeTelugu Trendingమరోసారి మాయ చేయబోతున్న సమంత-నాగచైతన్య

మరోసారి మాయ చేయబోతున్న సమంత-నాగచైతన్య

1 29
టాలీవుడ్‌లో ‘ఏ మాయ చేశావే’ సినిమాలో తొలిసారి కలిసి నటించి మెప్పించారు నాగచైతన్య, సమంత. గౌతమ్‌ మీనన్‌ డైరెక్షన్‌ ఈ చిత్రం తెరకెక్కింది. ఇక ఆ తరువాత ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న ఈ జంట మజిలీ, ఓ బేబీ సినిమాల్లో కలిసి నటించారు. అయితే ఇప్పుడు మరోసారి ఈ జంట కలిసినటించినున్నట్లు తెలుస్తోంది. తాజాగా మరోసారి గౌతమ్‌ మీనన్‌ కాంబినేషన్‌లోనే నాగచైతన్య, సమంత మెరవబోతున్నట్లు సమాచారం. పెళ్ళి తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ‘మజిలీ’ చిత్రంలో నటించారు. ఈ సినిమా ప్రేక్షకుల విశేష ఆదరణతో మంచి విజయాన్ని సాధించింది. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం ‘ఏ మాయ చేశావే’ చిత్రానికి సీక్వెల్‌ తీయాలనే యోచనలో ఉన్నట్టు గౌతమ్‌ మీనన్‌ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో.. చైతూ, సమంత మరోసారి కలిసి నటించబోతున్నారని సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ఆమె ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా ఓ సినిమా చేస్తోంది. దీంతో పాటు అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే ‘ది ఫ్యామిలీ మ్యాన్’ అనే వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ అతి త్వరలో స్ట్రీమ్ కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!