సమంత బాధ ఫ్లాప్ సినిమా కోసమా..?

లెజండరీ డైరెక్టర్ మణిరత్నం సినిమాలో నటించాలని ఇండస్ట్రీలో అందరూ కోరుకుంటారు. టాప్ హీరోలు సైతం ఆయన సినిమా అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి అవకాశాన్ని మిస్ చేసుకున్నందుకు సమంత తెగ బాధ పడిపోతుంది. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ
మణిరత్నంతో పని చేసే అవకాశం మిస్ చేసుకున్నాననే బాధ ఆమెలో ఉండిపోయిందట. అసలు విషయంలోకి వస్తే గతంలో సీనియర్ హీరో కార్తీక్ తనయుడు గౌతమ్ హీరోగా మణిరత్నం ‘కడల్’ చిత్రాన్ని రూపొందించారు.

ఈ సినిమాను తెలుగులో ‘కడలి’ పేరుతో విడుదల చేశారు. ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా సమంతను ఎన్నుకున్నారట. ఈ విషయాన్ని అఫీషియల్ గా కూడా అనౌన్స్ చేశారు. కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమా నుండి సమంత తప్పుకోవాల్సివచ్చింది. దీంతో ఆ అవకాశం సీనియర్ హీరోయిన్ రాధ కూతురు తులసికి దక్కింది. ఈ సినిమా అయితే డిజాస్టర్ అయింది కానీ మణిరత్నం సినిమాలో నటించే అవకాశం కోల్పోవడంతో మరోసారి ఆ అవకాశం వస్తుందో.. లేదో.. అని సమంత బాధ పడుతోంది.