HomeTelugu Big Stories'పుష్ప'లో సమంత ఐటెం సాంగ్‌!

‘పుష్ప’లో సమంత ఐటెం సాంగ్‌!

Samantha Special Song in Pu
క్రియేటివ్‌ దర్శకుడు సుకుమార్‌, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్‌ ఇండియా మూవీ ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం షరవేగంగా సాగుతోంది. ఈ మూవీలో హీరోయిన్ గా రష్మిక మందన్నా నటిస్తోంది. ఈ మూవీని రెండు పార్ట్స్‌గా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్‌, ఫస్ట్‌లుక్‌, సాంగ్‌లకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది.

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కాగా పుష్పలో సమంత భాగస్వామ్యం కానుందట. ఈ సినిమాలో సమంత స్పెషల్‌ సాంగ్‌తో సందడి చేయబోతుందని టాక్‌. విడాకుల అనంతరం సామ్‌ ఆ బాధ నుంచి బయట పడేందుకు బిజీగా ఉండే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో ఆమె వరుస ప్రాజెక్ట్స్‌కు సంతకం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆమె పుష్ప మూవీ ఐటెం సాంగ్‌లో కాలు కదపనుందని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇందుకు సంబంధించిన పక్కా సమాచారం కూడా వచ్చేసిందని సినీ వర్గాలు అంటున్నాయి. ఈ స్పెషల్‌ సాంగ్‌ కోసం ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేక సెట్‌ను కూడా వేస్తున్నారట. అక్కడనే ఈ నెల 26 నుంచి నాలుగు రోజులపాటు పాట చిత్రీకరణ జరగునుందట. ఇది విని అటు బన్నీ ఫ్యాన్స్‌, ఇటు సామ్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. అయితే మొదట ఈ ఐటెం సాంగ్‌ కోసం బాలీవుడ్‌ భామ నోరా ఫతేహి అనుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ అది రూమర్స్‌ వరకే ఉండగా.. తాజాగా సమంత పేరు తెరపైకి వచ్చింది. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!