తిరుమలకు కాలినడకన చేరుకున్న సమంత

తిరుమల శ్రీవారిని సినీ నటులు నాగచైతన్య, సమంత దంపతులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో నాగచైతన్య దంపతులకు పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ‘మజలీ’ సినిమా శుక్రవారం విడుదల కాబోతున్న నేపథ్యంలో స్వామివారి ఆశీస్సులు పొందారు. వీరితో పాటు హాస్యనటుడు బ్రహ్మానందం కూడా స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు అలిపిరి నుంచి కాలినడకన సమంత తిరుమలకు చేరుకున్నారు. రెండు గంటల్లోనే మెట్లు ఎక్కి ఆశ్చర్య పరిచారు.