టెర్రరిస్ట్‌గా సమంత!

టాలీవుడ్‌లో అక్కినేని సమంతకు అభిమానుల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాకోవాల్సిన అవసరం లేదు. ఈమెకు పెళ్లైనా కూడా ఇప్పటికీ స్టార్ హీరోలు కూడా ఈమెతో నటించడానికి సై అంటున్నారు. దర్శక నిర్మాతలు కూడా సమంత కోసం ప్రత్యేకంగ పాత్రలు రాస్తున్నారు. అలాంటి ఇమేజ్ అక్కినేని కోడలు సొంతం. ఇలాంటి సమయంలో ఇప్పుడు ఈమె విలన్‌గా నటించబోతుందని తెలుస్తుంది. గతంలో విక్రమ్ నటించిన 10 ఎంద్రాకుల్లా సినిమాలో ప్రతినాయిక పాత్రలో నటించింది. అందులో ద్విపాత్రాభినయం చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు ఏకంగా మెయిన్ విలన్ రోల్ చేయబోతుందనే ప్రచారం జరుగుతుంది.

ఈమె ఇప్పుడు సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మనోజ్ బాజ్‌పెయ్, ప్రియమణి, సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌ రెండో సీజన్‌లో సమంత నటించనుంది. కథ నచ్చడంతో నెగిటివ్ రోల్ చేయడానికి కూడా సిద్ధమైపోయింది సమంత. అందులోనూ ఈమెది టెర్రరిస్ట్ పాత్ర పోషిస్తుందని తెలుస్తుంది. ఇప్పటి వరకు అలాంటి పాత్ర తాను ఎప్పుడూ చేయకపోవడంతో స్యామ్ చాలా ఆసక్తిగా కనిపిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే షూట్ మొదలు కానుంది. మొత్తానికి చూడాలిక.. సమంత అక్కినేని విలన్ వేషాలు ఎలా ఉండబోతున్నాయో..?