
Sandeep Vanga Lavish Lifestyle:
టాలీవుడ్ లోని టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ హిట్స్ సాధించాయి. ఇప్పుడు ఆయన స్పిరిట్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా విషయంలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనేతో గొడవ హాట్ టాపిక్ అయ్యింది.
కొన్ని విభేదాల వలన దీపికా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని మీద స్పందించిన వంగా, సోషల్ మీడియాలో దీపికా పేరును నేరుగా చెప్పకపోయినా, ఆమెని ఉద్దేశించినట్లు గట్టిగా స్పందించారు. “మీ ఫెమినిజం అంటే ఇదేనా?” అంటూ నిలదీశారు.
ఈ వివాదం నడుస్తూనే ఉండగా.. వంగా జీవనశైలి కూడా హాట్ టాపిక్ అయింది. వారంగల్ లో పుట్టిన వంగా, హైదరాబాద్లో ఉంటున్నారు. గతంలో ఫిజియోథెరపిస్ట్‌గా పని చేసిన ఆయన, ఆ తర్వాత ఆస్ట్రేలియాలో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేశారు. ప్రస్తుతం ఆయన నెట్ వర్త్ రూ. 200 నుంచి రూ. 250 కోట్ల మధ్యగా అంచనా. ఒక్కో సినిమాకు రూ. 100 కోట్లు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట.
భూషణ్ కుమార్ ఇచ్చిన విలాసవంతమైన రూ. 5 కోట్ల కారు, హైదరాబాద్లోని లగ్జరీ నివాసం, అధునాతన ఆఫీసు ఆయన రిచ్ లైఫ్ స్టైల్‌కి చిన్న ఉదాహరణ. ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన దీపిక పడుకునే తో వివాదం ఎక్కడికి దారితీస్తుందో వేచి చూడాల్సిందే.
ALSO READ: కన్నడ భాషను అవమానించిన Kamal Haasan? ఏమన్నారంటే..