
Kamal Haasan Kannada Controversy:
చెన్నైలో జరిగిన ‘థగ్ లైఫ్’ ఈవెంట్‌లో కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదానికి దారి తీశాయి. ఆయన మాట్లాడుతూ “కన్నడ భాష తమిళ భాష నుంచే జన్మించింది” అని చెప్పడం కర్ణాటకలో పెద్ద రగడను తెచ్చింది. ప్రో-కన్నడ గ్రూప్స్ ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం తెలిపారు.
కన్నడ రక్షణ వేదిక లీడర్ ప్రభీన్ శెట్టి “కమల్ హాసన్ తమిళాన్ని ఎత్తిచూపుతూ, కన్నడను అవమానించడమే చేశాడు. ఆయన కన్నడ ప్రేక్షకుల మద్దతు కావాలని చూస్తున్నా, అలాగే మాట్లాడటం ఎలా?” అంటూ విమర్శించారు.
#BreakingNews | Pro Kannada Groups protest against actor Kamal Hasan after the actor made a controversial statement on the #Kannadalanguage@BharadwajSudath shares more details @JamwalNews18 | #KamalHaasan #ThugLife #Tamil pic.twitter.com/HzIvl2F4yK
— News18 (@CNNnews18) May 27, 2025
ఈ విషయంపై నిరసనల్లో భాగంగా బెంగళూరులో ‘థగ్ లైఫ్’ సినిమా పోస్టర్లు చించేశారు. కమల్ హాసన్ ఈవెంట్‌కి రావలసిన ప్రదేశం వద్ద అడ్డుకోవడానికి ప్లాన్ చేశారు కానీ ఆయన్ను బ్లాక్ ఇంక్‌తో అటాక్ చేస్తారని తెలిసి ఆయన అక్కడికి రాలేదంటూ ఆరోపించారు.
బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీవై విజయేంద్ర కూడా స్పందిస్తూ, కమల్ హాసన్ వ్యాఖ్యలు “సంస్కారం లేని ప్రవర్తన”గా పేర్కొన్నారు. “కన్నడ భాషకు 2500 ఏళ్ల చరిత్ర ఉంది. అలాంటి భాషను అవమానించడం బాధాకరం,” అని అన్నారు.
కమల్ హాసన్ ఇటీవలి కాలంలో హిందూ ధర్మాన్ని కూడా అనేకసార్లు తప్పుగా వ్యాఖ్యానించినట్టు విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలతో 6.5 కోట్ల కన్నడిగులను క్షోభకు గురిచేశారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇంత వివాదం జరిగిన తర్వాత ‘థగ్ లైఫ్’ సినిమాకు కర్ణాటకలో బహిష్కారం విధించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. కమల్ హాసన్ క్షమాపణ చెప్పకపోతే, సినిమా రిలీజ్‌కి ఇబ్బందులు ఎదురవుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
ALSO READ: Deepika Padukone నో చెప్పిన 8 బ్లాక్ బస్టర్ సినిమాలు ఇవే!