‘సరిలేరు నీకెవ్వరూ’ నుండి ఫ్యామిలీ సాంగ్‌


టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరూ’. ఈ సినిమా టీజర్ ఇప్పటికే విడుదల చేశారు.. టీజర్ మంచి విజయం సాధించింది. ఆ తరువాత ఫస్ట్ సింగిల్ ను గత సోమవారం రోజున రిలీజ్ చేశారు. ఫస్ట్ టైమ్ మహేష్ బాబు ర్యాప్ సాంగ్ చేయబోతున్నారు. సాంగ్ మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

కాగా, డిసెంబర్ 9 వ తేదీ సోమవారం రోజున సరిలేరు నీకెవ్వరూ సినిమాలోని సెకండ్ సింగిల్ సూర్యుడివో.. చంద్రుడివో అనే సాంగ్ ను విడుదల చేయబోతున్నారు. ఇది పక్కా ఫ్యామిలీ సాంగ్ అని తెలుస్తోంది. పచ్చని పంట పొలంలో మహేష్ బాబు.. విజయశాంతి వెనుక రాజేంద్ర ప్రసాద్ నడుస్తూ వెళ్తున్న ఫోటోను రిలీజ్ చేసింది. ఈ సాంగ్ ను సోమవారం రోజున రిలీజ్ చేయబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈచిత్రం వచ్చే ఏడాది జనవరి 11 వ తేదీన విడుదల కాబోతుంది.

CLICK HERE!! For the aha Latest Updates