దుబాయ్‌లో ‘సర్కారు వారి పాట’ ప్రారంభం


సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త‌మ‌న్ ఈ సినిమాకి సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఈ రోజు దుబాయ్‌లో ప్రారంభ‌మైంది. ఈ విష‌యాన్ని అధికారికంగా తెలియ‌జేస్తూ ‘ది ఆక్ష‌న్ అండ్ ది యాక్ష‌న్ బిగిన్స్’ అంటూ ఒక వీడియో విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.

ఈ సంద‌ర్భంగా.. చిత్ర ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ పెట్ల మాట్లాడుతూ.. ‘సర్కారు వారి పాట’ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఈ రోజు దుబాయ్‌లో ప్రారంభ‌మైంది. సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు గారిని డైరెక్ట్‌ చేయాల‌న్న ఇన్నేళ్ళ నా క‌ల ఈ రోజు నిజ‌మైంది. మహేష్ బాబు గారితో వర్క్ చేయడం చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ఈ మూవీని ఒక ఛాలెంజింగ్ తీసుకుని చేస్తున్నాను. డెఫినెట్‌గా ప్రేక్షకుల, మహేష్ బాబు అభిమానుల అంచనాలకు తగినట్లుగా ఈ సినిమా పెద్ద స్థాయిలో ఉంటుంది. ఇర‌వై రోజుల పాటు దుబాయ్‌లో ఫ‌స్ట్ షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది. ఇత‌ర న‌టీన‌టులు సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తాం` అన్నారు.

CLICK HERE!! For the aha Latest Updates