HomeTelugu Trendingమెగాస్టార్‌ గుండు వెనుక సీక్రెట్‌ ఇదే

మెగాస్టార్‌ గుండు వెనుక సీక్రెట్‌ ఇదే

Secret behind chiranjeevi u
మెగాస్టార్ చిరంజీవి తాజాగా గుండుతో ఉన్న ఫొటో షేరు చేసి అభిమానులను ఆశ్చర్యపరిచారు. అయితే ఇప్పడు నిజంగా చిరంజీవి గుండు చేయించుకున్నాడా అని అభిమానులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఆ ఫోటోను చూసి అభిమానులు మెగా లుక్ అదిరిపోయింది బాసూ అంటున్నారు. లాక్‌డౌన్ టైమ్‌లో ఒక్కోసారి ఒక్కో న్యూ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఆ మధ్య మీసాలు లేకుండా కనిపించి ఆశ్యర్యపరిచాడు. అయితే తాజాగా ఈ గుండు వెనక ఉన్న అసలు సీక్రెట్‌ను బయటపెట్టాడు మెగాస్టార్‌.

చిరంజీవి ఆచ్చార్య తర్వాత మెహర్ రమేష్ డైరెక్షన్‌లో తమిళంలో హిట్టైన ‘వేదాలం’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. కోలీవుడ్‌లో అజిత్ హీరోగా వచ్చిన ఈ చిత్రాన్ని శివ తెరకెక్కించాడు. అక్కడ సూపర్ హిట్ అయింది వేదాళం. అప్పట్లో పవన్ కళ్యాణ్ హీరోగా నీసన్ దర్శకత్వంలో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నాడు నిర్మాత ఏఎం రత్నం. ఈ మేరకు పూజా కార్యక్రమాలు కూడా చేశారు కానీ కుదర్లేదు. అయితే ఇప్పుడు ఇదే సినిమాను చిరంజీవి రీమేక్ చేస్తున్నాడు.

ఈ సినిమా ఒరిజినల్ వర్షన్‌లో అజిత్ గుండుతోనే ఉంటాడు. చిన్న వెంట్రుకలతో ఆ హెయిర్ స్టైల్ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే ఎపిసోడ్ కోసం ఇప్పుడు చిరంజీవి కూడా గుండుతో కనిపిస్తే ఎలా ఉంటుదనే విషయాన్ని చెక్ చేసుకోవడానికి గుండుతో టెస్ట్ లుక్ చేయించుకున్నాడు. మేకప్ నిపుణుల ఇది నిజమైన గుండు అనేలా చిరంజీవిని గుండు లుక్‌లో మేకప్ చేశారు. చిరంజీవి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇది మేకప్ టెస్ట్ అని చెప్పేంత వరకు అందరు చిరంజీవిది నిజం గుండే అనుకున్నారు. మొత్తానికి మేకప్ నిపుణులు చిరుకు చేసిన ఈ మేకప్ ఇపుడు మరోసారి చర్చనీయాంశం అయింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!