రమాప్రభ గురించి శరత్‌బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

టాలీవుడ్‌లో సీనియర్‌ నటుడు శరత్ బాబు తాజా ఓ ప్రముఖ ఛానల్‌కు ఇంటర్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ఆస్తకికరమైన అంశాలకు తెలియజేశారు. రమాప్రభకు సంబంధించిన విషయంపై శరత్ బాబు ఓపెన్ అయ్యాడు. టాలీవుడ్‌లో కొన్ని బంధాలు ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటాయి. అందులో శరత్ బాబు, రమాప్రభ గురించి కూడా చెప్పుకోవాలి. దాదాపు 50 ఏళ్ల కింద వీళ్ళ వివాహం జరిగింది. అప్పట్లో ఇద్దరూ కొన్నేళ్లు కలిసున్నారు. ఆ తర్వాత మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా విడిపోయారు.

శరత్‌బాబు మాట్లాడుతూ.. అందరూ అనుకుంటున్నట్లు రమాప్రభను తానే మోసం చేయలేదని.. అసలు తమ మధ్య జరిగింది పెళ్ళి కాదు ఒక కలయిక మాత్రమే అంటున్నాడు. అప్పుడే చదువు పూర్తి చేసుకుని ఇండస్ట్రీకి వచ్చిన తాను.. తన కంటే వ‌య‌సులో ఐదారేళ్లు పెద్దదైన రమాప్రభను పెళ్లి చేసుకొని చాలా పెద్ద తప్పు చేశానని చెప్పాడు శరత్ బాబు. జీవితంలో తాను తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్ల తర్వాత ఏం కోల్పోయానో అర్థమైందని చెప్తున్నాడు. జరిగిపోయిన గతం గురించి ఇప్పుడు ఆలోచించి లాభం లేదంటున్నాడు శరత్ బాబు.

అందరూ అనుకుంటున్నట్లు తాను రమాప్రభ ఆస్తులను ఏమీ రాయించుకోలేద‌ని.. అలాంటి ఆరోపణలు వచ్చినందుకు తానే తన ఆస్తులు అమ్మి రమాప్రభతో పాటు ఆమె సోదరుడు పేరుమీద రాసిచ్చాన‌ని చెప్పాడు శరత్ బాబు. వాటి విలువ ఇప్పుడు 50 నుంచి 60 కోట్లు ఉంటుందని షాకింగ్ న్యూస్ చెప్పాడు ఈయన.

టీ నగర్‌లో ఉన్న ఆస్తులు 100 కోట్లుపైనే ఉంటాయంటున్నాడు. మొత్తానికి ఇన్నాళ్ల తర్వాత శరత్ బాబు, రమాప్రభ సంబంధం గురించి మరో వార్త బయటకు వచ్చింది. ఇన్నేళ్లూ కేవలం రమాప్రభ కోణంలోంచే అన్ని సమాధానాలు తెలిసాయి. ఇప్పుడు శరత్ బాబు కొన్ని ప్రశ్నలు వేశారు.. మరి దీనికి రమాప్రభ ఎలాంటి సమాధానం చెబుతుందో చూడాలి.