
Senior Telugu Hero with 3 body doubles:
తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోలు తమ సినిమాల్లో యాక్షన్ సీన్లు, డ్యాన్స్ మూమెంట్స్ చేయడానికి బాడీ డబుల్స్‌ను ఎక్కువగా వాడుతుంటారు. కానీ ఇప్పుడు బయటకొచ్చిన విషయాలు మాత్రం ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి.
ఒక టాప్ హీరోకు యాక్షన్ సీన్లకే కాకుండా డ్యాన్స్ సీన్స్, లాంగ్ షాట్స్ అన్నింటికీ కూడా బాడీ డబుల్ వాడుతున్నారు. ఈ బాడీ డబుల్ ఒక తెలుగు వ్యక్తే. ఆయన కొన్నేళ్ల పాటు ఆస్ట్రేలియాలో పనిచేసి ఇప్పుడు హైదరాబాద్‌లో సెటిల్ అయిపోయారు. ఈ హీరోకు డబుల్‌గా పనిచేస్తూ బాగా సంపాదిస్తున్నారట.
ఇదిలా ఉంటే, ఇప్పుడు మరో సీనియర్ హీరో గురించి ఓ నిజం బయట పడింది. ప్రస్తుతం 50ల లో ఉన్న ఈ హీరోకు ఒకడే కాదు.. ముగ్గురు బాడీ డబుల్స్ ఉన్నారట! ఆయనకు స్టామినా తక్కువగా ఉండడం, ఇతర పనుల్లో బిజీగా ఉండటం వల్ల ఇలా చేస్తున్నారట.
ఇప్పుడు చూస్తే, దాదాపుగా టాప్ హీరోలందరూ శ్రమపడే సీన్స్‌లో తమ డబుల్స్‌ను వాడుతున్నారు. వాళ్లు మాత్రం రిలాక్స్ అవుతూ తమ వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.
ఇది రైటర్స్‌కి ‘ఘోస్ట్ రైటర్స్’ ఉండడంలా… హీరోలకి ఇప్పుడు ‘ఘోస్ట్ హీరోస్’ వచ్చేసారు! బాడీ డబుల్స్ లేకపోతే చాలా సీన్లు జరిగే అవకాశం లేదు అనడంలో సందేహం లేదు.