HomeTelugu Newsనేను 25 శాతం కాలేయంతోనే జీవిస్తున్నా: అమితాబ్‌

నేను 25 శాతం కాలేయంతోనే జీవిస్తున్నా: అమితాబ్‌

11 10బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌.. ‘ఇప్పుడు నేను 25 శాతం కాలేయంతోనే జీవిస్తున్నా’నంటూ అందర్నీ షాక్‌కు గురి చేశారు. తాజాగా ఆయన స్వస్థ్‌ ఇండియా అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ఆరోగ్యం గురించి వేదికపై మాట్లాడారు. తరచూ తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలని సూచించారు. దీని వల్ల వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి, సులభంగా నివారించుకోవచ్చని పేర్కొన్నారు.

‘ఒకప్పుడు నాకు క్షయ, హైపటైటిస్‌ బి వ్యాధులు ఉండేవి. దాదాపు ఎనిమిదేళ్లు వీటిని నేను గుర్తించలేకపోయాను. తరచూ వైద్య పరీక్షలు చేయించుకోకపోవడం వల్ల ఇలా జరిగింది. చెడు రక్తం వల్ల అప్పటికే నా కాలేయం 75 శాతం చెడిపోయింది. ఇప్పుడు నేను కేవలం 25 శాతం కాలేయంతో జీవిస్తున్నా. క్షయ వ్యాధికి నివారణ ఉంది. కానీ గుర్తించకపోవడం వల్ల నేను నష్టపోయా. ఇదంతా నేను పబ్లిసిటీ కోసం చెప్పుకోవడం లేదు. నాలాగా మరొకరు బాధపడకూడదని చెబుతున్నా. మీరు పరీక్షలు చేయించుకోలేకపోతే.. వ్యాధిని గుర్తించలేరు, ఎప్పటికీ నివారించుకోలేరు’ అని బిగ్‌బి అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!