HomeTelugu Trendingకొడుకు పరిస్థితిపై షార్‌క్‌ భావోద్వేగం

కొడుకు పరిస్థితిపై షార్‌క్‌ భావోద్వేగం

Shah rukh khan meet his son

బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుక్‌ ఖాన్‌ డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయిన తన తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ను విడిపించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. అయినప్పటికీ అతడికి బెయిల్‌ రాలేదు. దీంతో షారుక్‌ కుటుంబం తీవ్ర నిరాశలో ఉన్నట్లు సమాచారాం.

ఈ నేపథ్యంలో తొలిసారిగా కొడుకు ఆర్యన్‌ను చూసేందుకు ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలుకి వెళ్లిన షారుక్‌ దాదాపు 18నిమిషాల వరకు మాట్లాడినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో కొడుకు పరిస్థితి పై తండ్రి షారుక్‌ తీవ్ర భావోద్వేగానికి లోనైనట్లు తెలుస్తుంది.

ఈ క్రమంలో..సరిగ్గా తింటున్నావా అని షారుక్‌ అడగ్గా.. జైలు భోజనం బాగోలేదని ఆర్యన్‌ సమాధానం ఇచ్చినట్లు సమాచారం. దీంతో కొడుకు కోసం ఇంటి భోజనం పంపించొచ్చా అని షారుక్‌ జైలు అధికారులను అడగ్గా.. ఇందుకోసం కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని వారు చెప్పినట్లు తెలుస్తుంది.

జైళ్లో ఆర్యన్‌ సరిగ్గా తినడం లేదని, అంతేకాకుండా తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తుంది. దీంతో ఆర్యన్‌ ఆరోగ్య పరిస్థితిపై షారుక్‌ ఆందోళన చెందుతున్నట్లు సన్నిహితులు తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!