HomeTelugu Trendingడైవోర్స్‌ సెలబ్రేట్‌ చేసుకున్న నటి.. ఫోటో షూట్‌ వైరల్‌

డైవోర్స్‌ సెలబ్రేట్‌ చేసుకున్న నటి.. ఫోటో షూట్‌ వైరల్‌

tamil actress celebrates he
తమిళ బుల్లితెర నటి షాలిని ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. ‘ముల్లుం మలరుమ్’ అనే టీవీ సీరియల్ నటి షాలిని తాజాగా తన ఫొటోషూట్ తన సోషల్‌ మీడియా ఖాతాలో పోస్ట్‌ చేసింది. సీరియల్‌ ద్వారా పొందిన గుర్తింపు కంటే ఇప్పుడు ఎక్కువ పాపులర్ అయింది. అయితే, సాధారణంగా ఫొటోషూట్స్‌ అంటే ఫిమేల్ యాక్టర్స్ తమ అందాలు ప్రదర్శిస్తారని తెలిసిందే. కానీ ఈ ఫొటోషూట్ మాత్రం చాలా డిఫరెంట్‌. షాలిని, తన భర్త నుంచి విడాకులు పొందిన ఆనందాన్ని యూనిక్ స్టైల్‌లో సెలబ్రేట్ చేసుకునేందుకు ఈ ఫొటోషూట్ చేయగా.. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

రెడ్ కలర్ అవుట్‌ఫిట్స్ ధరించిన షాలిని.. తమ మ్యారేజ్ ఫొటోస్ ఒక్కొక్కటి చింపేస్తూ సంతోషంగా విడాకుల విషయాన్ని ప్రకటించింది. ఫొటోలను చింపివేయడంతో పాటు వాటిని కాళ్లకింద నలిపేయడం కూడా చూడొచ్చు. అలాగే ఒక ఫొటోలో ’99 సమస్యలున్నా పర్లేదు కానీ భర్తే సమస్య కాకూడదు’ అనే ప్లకార్డ్‌ను పట్టుకుని కనిపించింది. ఇక ఈ ఫొటోలతో పాటు ఒక స్ట్రాంగ్ మెసేజ్‌ను కూడా తన పోస్టులో యాడ్ చేసింది.

tamil actress 1

‘సమస్యలపై గొంతెత్తలేనివారికి విడాకులు తీసుకున్న ఈ మహిళ సందేశం: చెడు వివాహాన్ని విడిచిపెట్టడం సరైందే. ఎందుకంటే సంతోషంగా ఉండటమనేది మీ హక్కు. దాన్ని ఎవరి కోసమో తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. మీ జీవితాలపై నియంత్రణ తెచ్చుకుని.. మీతో పాటు మీ పిల్లల భవిష్యత్తుకు అవసరమైన మార్పులు చేసుకోండి. డివోర్స్ అనేది ఫెయిల్యూర్ కాదు!!! ఇదొక మలుపు, మీ జీవితంలో సానుకూల మార్పులకు దారి తీస్తుంది. మ్యారేజ్ రిలేషన్‌షిప్ వదిలేసి ఒంటరిగా నిలబడాలంటే చాలా ధైర్యం కావాలి. ఇలాంటి ధైర్యవంతులైన మహిళలందరికీ దీన్ని అంకితం చేస్తున్నాను’ అంటూ నోట్‌లో పేర్కొంది షాలిని.

దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది ఆమెకు మద్దతు ఇస్తుంటే.. కొంతమంది మాత్రం విమర్శలు చేస్తున్నారు.

ఆస్తికరంగా ‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu