రెమ్యూనరేషన్ పెంచేశాడు!

టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న యంగ్ హీరోల్లో శర్వానంద్ ఒకరు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ హీరో ఇటీవల ‘శతమానం భవతి’ సక్సెస్ తో ఫ్యామిలీ హీరోగా కూడా పేరు దక్కించుకున్నాడు. ఈ సినిమా ముప్పై కోట్లు కొల్లగొట్టడంతో శర్వా తన పారితోషికం కూడా పెంచేయాలని ఫిక్స్ అయిపోయాడు. దీంతో తన దగ్గరకు వస్తోన్న నిర్మాతలకు మూడున్నర కోట్లు రెమ్యూనరేషన్ గా చెబుతున్నాడు. ఇప్పటివరకు రెండున్నర కోట్లు పుచ్చుకున్న శర్వా ఉన్నట్టుండి కోటి రూపాయలు పెంచడంతో నిర్మాతలు షాక్ అవుతున్నారు.

కొందరు మాత్రం అతనికున్న క్రేజ్ కు మూడున్నర కోట్లు ఇవ్వడంలో తప్పులేదని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటిస్తోన్న ‘రాధ’ సినిమా టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది. దీని తరువాత ఆయన గీతాఆర్ట్స్ లో, సితార ఎంటర్టైన్మెంట్స్ లో అలానే దిల్ రాజు బ్యానర్ లో సినిమాలు చేయనున్నారు. మరి ఈ సినిమాలు శర్వా స్థాయిని ఏ రేంజ్ కు పెంచుతాయో.. చూడాలి!