బిగ్‌బాస్ తెలుగు 22వ(ఆగస్ట్ 11) ఎపిసోడ్ హైలైట్స్‌

బిగ్‌బాస్ సీజన్ 3 తెలుగు ఇప్పటి వరకు 21 ఎపిసోడ్‌‌లు ముగిశాయి. 22వ ఎపిసోడ్‌లోకి ఎంటరయింది. ఈరోజు స్పెషల్‌ ఏంటంటే ఎలిమినేషన్. ఈవారం అంతగా టెన్షన్‌ ఏమీ లేదు, ఎందుకంటే చాలామంది ఊహించినట్టుగానే ఎలిమినేషన్ జరిగింది. అలాగే సోషల్ మీడియాలో ప్రచారమూ జరిగింది. ఇంకా ఈరోజు వెన్నెల కిషోర్ అతిథిగా వచ్చాడు.

శనివారం నాటి ఎపిసోడ్‌లో హౌస్‌మేట్స్‌కు చురకలంటించిన నాగార్జున ఆదివారం ఎపిసోడ్‌లో వారితో ఆటలాడించాడు. ‘అంకితం నీకే అంకితం’ అనే ఆటను హౌస్‌మేట్స్‌తో ఆడిస్తూ ఎంటర్‌టైన్‌ చేశాడు. ఆట ఎలాగంటే టేబుల్ పైన కొన్ని కార్డులు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక కార్డు తీయాలి. అందులో పాటను హౌస్‌లో ఎవరో ఒకరికి అంకితం ఇవ్వాలి. ఆ పాట ఎవరికి అంకితం చేస్తున్నారో, అలాగే ఎందుకు చేస్తున్నారో కూడా చెప్పాలి అన్నాడు బిగ్‌బాస్. ముందుగా శ్రీముఖి వచ్చి ఓ కార్డ్‌ను సెలెక్ట్‌ చేసుకోగా అందులో పంతం నీదా నాదా సై అనే పాట వచ్చింది. అది రాహుల్‌కు అంకితం చేస్తున్నట్లు తెలిపింది. ఆ పాటను బిగ్‌బాస్ ప్లే చేయడం, దానికి సభ్యులు ఆడటం జరిగింది.

ఆ తరువాత శివజ్యోతి తనకు వచ్చిన మౌనంగానే ఎదగమని పాటను అలీకి అంకితం ఇచ్చింది. బాబా భాస్కర్‌ తనకు వచ్చిన ఒక్క మగాడు పాటను తమన్నాకు అంకితమిచ్చాడు. పునర్నవికి వచ్చిన ఓ సక్కనోడా పాటను రవికృష్ణకు అంకితమిచ్చింది. అలాగే హిమజ నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డి అనే పాటను బాబా భాస్కర్‌కు అంకితమివ్వగా వరుణ్‌ సందేశ్‌.. కన్నుల్లో నీరూపమే పాటను వితికాకు అంకితమిచ్చాడు. ఒక వేళ వితికా అక్కడ లేదంటే ఆ పాటను ఎవరికి అంకితం చేస్తావని నాగార్జున అడిగాడు. రాహుల్‌కు అంకితమిస్తానన్నాడు. రాహుల్‌ తనకు వచ్చిన చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే పాటను రోహిణికి అంకితమిచ్చాడు. అషూ రెడ్డి గోవిందా గోవిందా పాటను వితికాకు అంకితమిచ్చింది. అక్కడితో ఆటకు బ్రేక్ ఇచ్చి ఎలిమినేషన్‌లోంచి ఎవరు సేఫ్ తెలుసుకుందామంటూ స్టోర్‌ రూమ్‌లోంచి ఓ సూట్‌కేసును తెమ్మని అషూని పంపుతాడు. ఆ సూట్‌కేసుపై ఎవరి పేరుంటే వారు సేఫ్‌. అలా రాహుల్‌ సేఫ్‌ అయినట్లు తెలిపాడు.

ఆ తర్వాత ఆటలో భాగంగా రవికృష్ణ..లుక్‌ ఎట్‌ మై ఫేస్‌ ఇన్‌ ది మిర్రర్‌ అనే పాటను అలీకి, ఆ తర్వాత రోహిణి.. దొంగ దొంగ వచ్చాడే పాటను బాబా భాస్కర్‌కు, తర్వాత వితికా..నాలో నేను లేనే లేను అనే పాటను శివజ్యోతికి, తర్వాత అలీ.. నీ దూకుడు సాటెవ్వరూ అనే పాటను రవికృష్ణకు అంకితమిచ్చారు. తమన్నా కార్డులో వచ్చిన మగాళ్లు ఒట్టిమాయగాళ్లే అనే పాటను రవికృష్ణకు అంకితం ఇచ్చింది. తర్వాత మహేష్‌ తనకు వచ్చిన అమ్మ బ్రహ్మదేవుడో సాంగ్‌ను పునర్నవికి అంకితమిచ్చాడు. దీంతో హౌస్‌లో నవ్వులు పూశాయి. ఎక్కడో ఎవరికో కాలుతోంది అని రాహుల్‌ను ఉద్దేశించి నాగార్జున సెటైర్ వేశాడు. అనంతరం పునర్నవి సేఫ్‌ అయినట్లు ప్రకటించాడు.

అతిథిగా వచ్చిన వెన్నెల కిషోర్‌ హౌస్‌లోని సభ్యుల గురించి బయట వారికున్న ఫాలోయింగ్‌ గురించి వివరించాడు. పునర్నవి విషయంలో రాహుల్‌నుద్దేశించి పులిహోర రెసిపి అన్నాడు. శ్రీముఖికి తమ ఇంట్లోనే ఫ్యాన్స్‌ ఉన్నారని వెన్నెల కిషోర్‌ తెలిపాడు. పునర్నవి, హిమజకు సూపర్‌ ఫాలోయింగ్‌ ఉందని వివరించాడు. ప్రేమతో హగ్‌ చేసుకుంటే అలా తోసేయ్యకు అంటూ వరుణ్‌కి, మంచితనానికి మారుపేరు రవి అని, అషూ రెడ్డి స్మైల్‌కు ఫ్యాన్స్‌ ఉన్నారని ఇలా వాళ్ల గురించి వివరించాడు. తర్వాత బాబా భాస్కర్‌ సేఫ్‌ అయినట్టు వెన్నెల కిషోర్‌ ప్రకటించాడు.

ఇక మిగిలిన ఇద్దరిలో తమన్నా ఎలిమినేట్‌ అయినట్లు నాగ్‌ ప్రకటించాడు. బయటకు వచ్చిన తమన్నాకు అందరి ఫొటోలను చూపించి ఒక్కొక్కరిపై మీ అభిప్రాయం చెప్పాలని ఒక నిమిషం టైమ్‌ ఇచ్చాడు. హౌస్‌మేట్స్‌ అందరి గురించి తన అభిప్రాయాలను తెలిపింది. వరుణ్‌ సందేశ్‌ మంచి వాడని కానీ, పక్కవారి మాటలు వింటాడని తెలిపింది. శ్రీముఖి ఆడపులి అని, హిమజ లవ్లీ లేడీ అని, పునర్నవి స్ట్రాంగ్‌ లేడీ అని కాకపోతే పక్కవారి మాటలకు ప్రభావితం అవుతుందని, అషూ గుడ్‌లేడీ అయితే అప్పుడప్పుడు టాస్క్‌లో కూడా పార్టిపిసేట్‌ చేయాలని సలహా ఇచ్చింది. రాహుల్‌ గురించి చెప్పాలంటే ఆడవారికి గౌరవం ఇవ్వడం తెలీదని, రవికృష్ణను హీరోలా చూడాలనుకుంటున్నానని తెలిపింది. రోహిణిలాంటి వారు బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండకూడదని బయటి ఫ్రెండ్‌షిప్‌లే ఇక్కడ కూడా చూపిస్తుందని తెలిపింది. శివజ్యోతికి ఏది చెప్పినా చెడుగానే తీసుకుంటుందని, వితికా మంచిదే కాని కారాలు మిర్యాలు నూరుతుందని, రాహుల్‌ మాటలకు ఇన్‌ఫ్లూయెన్స్‌ అవుతుందని పేర్కొంది. బాబా భాస్కర్‌ తనకు తల్లి, తండ్రి, గురువు లాంటి వాడంటూ కన్నీరు కార్చింది. మొదటి వారంలో చూసినట్లు మహేష్‌ ప్రస్తుతం లేడని, పబ్లిక్‌ తన వెంట ఉన్నారని, తన ఆట తనను ఆడమని మహేష్‌కు సలహా ఇచ్చింది.

ఈ ఎపిసోడ్‌ ఇక్కడితో ముగిస్తూ రేపటి ఎపిసోడ్‌లో ఇద్దరి చొప్పున కన్‌ఫెషన్‌ రూమ్‌లోకి పిలిచి మీలో ఎవరు ఎలిమినేట్ కావాలనుకుంటున్నారో చెప్పమంటూ మళ్లీ ఫిట్టింగ్ పెట్టాడు బిగ్‌బాస్. చూద్దాం రేపటి ఎపిసోడ్‌లో ఏంజరుగుతుందో…