HomeTelugu Trendingశిల్పా శెట్టి కుమారుడు వియాన్‌ 'ఛైర్‌బలి'

శిల్పా శెట్టి కుమారుడు వియాన్‌ ‘ఛైర్‌బలి’

5 9తెలుగు చిత్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన మూవీ ‘బాహుబలి’. దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరోగా యంగ్‌ రెబెల్‌స్టార్‌ ప్రభాస్ నటించారు‌. ఈ చిత్రంలో శివలింగాన్ని భుజంపై మోసే సన్నివేశం హైలైట్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు ఇదే సన్నివేశాన్ని బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి కుమారుడు వియాన్‌ అనుకరించాడు. వియాన్‌ కోసమని శిల్ప ‘బాహుబలి’ సినిమాను పెట్టారు. ప్రభాస్.. శివలింగాన్ని మోస్తున్న సన్నివేశం రాగానే వియాన్‌ కుర్చీ ఎత్తి భుజంపై పెట్టుకుని బుల్లి ‘బాహుబలి’ లా మారిపోయాడు. ప్రభాస్‌ను వియాన్‌ అనుకరిస్తున్నప్పుడు తీసిన వీడియోను శిల్ప భర్త రాజ్‌కుంద్రా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ‘బాహుబలి’ సంగతి పక్కనపెట్టండి.. ఈ ‘ఛైర్‌బలి’ని చూడండి. వీడికి ఇన్ని యాక్టింగ్‌ మెళకువలు ఎక్కడి నుంచి వచ్చాయో..! వీడి వేశాలు చూసి నాకు నవ్వు ఆగడంలేదు’ అని సరదాగా క్యాప్షన్‌ ఇచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!