HomeTelugu Trendingవైష్ణవ్‌ తేజ్‌ సినిమాలో మరో బ్యూటీ!

వైష్ణవ్‌ తేజ్‌ సినిమాలో మరో బ్యూటీ!

Shobhita rana in vaishnav t
వైష్ణవ్ తేజ్ హీరోగా గిరీశయ్య డైరెక్షన్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో కేతికా శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం మేకర్స్ శోభితా రానాను సినిమాలోని ముఖ్యమైన పాత్రకు తీసుకున్నారు. ఆమె “గిరీశయ్య” చిత్రంతో ఎంట్రీ ఇస్తోంది.

రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా సెట్స్‌లో చేరిన నటి శోభితా రానా ఈ సినిమా అవకాశం గురించి హ్యాపీగా ఉన్నారు. మీడియా ఇంటరాక్షన్ సమయంలో శోభిత మాట్లాడుతూ “ఇంత పెద్ద సినిమాలో భాగమైనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. తెలుగు చిత్ర పరిశ్రమలో భాగం కావడానికి ఇది గొప్ప సమయం అని నేను అనుకుంటున్నాను” అని అన్నారు. శోభితా రానా హిందీ, కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటి. ఇప్పుడు తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu