
Indian Cinemas World Record:
భారీ బడ్జెట్ సినిమాలు, గ్రాఫిక్స్, VFX లతో నేటి సినిమాలు ఎంత అద్భుతంగా ఉన్నా, 1982లో వచ్చిన ఒక సినిమా మాత్రం రికార్డులను తిరగరాసింది. అదే “గాంధీ” సినిమా. రిచర్డ్ అటన్‌బరో దర్శకత్వం వహించిన ఈ బహుళ అవార్డు విజేత సినిమాలో మహాత్మా గాంధీ అంత్యక్రియల సన్నివేశం కోసం లైవ్‌గా 3 లక్షల మంది ప్రజలను ఉపయోగించారు!
ఇది ఎప్పటిదంటే… 1981 జనవరి 31న, గాంధీ మరణించిన 33 ఏళ్ల తర్వాత ఢిల్లీలో ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారు. అందులో 94,560 మంది కి పారితోషికం ఇచ్చారు, మిగతా 2 లక్షల మంది వాలంటీర్లు. హీరో బెన్ కింగ్స్‌లే గాంధీగా నటించి, అశ్రునయనంగా కూర్చున్నా… ఆ సన్నివేశం ప్రేక్షకుడిని ఆలోచించేసేలా చేసింది.
సీనును రెండు నిమిషాలే చిత్రీకరించారే కానీ, దానికి పట్టిన ప్రిపరేషన్ మాత్రం నెలల తరబడి. ఇండియన్ ఆర్మీ, లొకల్ ఆర్గనైజేషన్లు కలిసి క్రమశిక్షణగా కంట్రోల్ చేశారు. మొత్తం 11 కెమెరా టీమ్‌లు ఈ సన్నివేశాన్ని క్యాప్చర్ చేశాయి.
ఈ సీన్ కు గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా దక్కింది – ఒకే సీన్‌లో ఎక్కువ మంది రియల్ పీపుల్ వాడిన మొదటి సినిమా అనే గౌరవం.
ఇప్పుడు మనం సినిమాల్లో పెద్ద పెద్ద జన సమూహాలను చూస్తాం, కానీ అవన్నీ కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో. కానీ “గాంధీ” సినిమాలో చూపిన ఈ లైవ్ క్రౌడ్ మాత్రం ఇప్పటికీ ప్రేక్షకులకు నచ్చే సన్నివేశంగా నిలిచి ఉంది.
ALSO READ: తెలుగు రాష్ట్రాల్లో Theater Ban ఉన్నట్టా లేనట్టా?