HomeTelugu Big Storiesదీపికాను మించిపోయిన శ్రద్ధాకపూర్‌

దీపికాను మించిపోయిన శ్రద్ధాకపూర్‌

Shraddha kapoor beats deepi
‘సాహో’ బ్యూటీ శ్రద్ధాకపూర్‌కు అభిమానుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. టాలీవుడ్‌ యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌కు సాహో సినిమాలో జంటగా నటించిన తర్వాత ఆమెకు తెలుగులో కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు ఏర్పడ్డారు. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో అత్యధికంగా ఫాలోయర్లను కలిగిన భారతీయ సెలబ్రిటీల జాబితాలో శ్రద్ధ మరో స్థానం పైకి ఎదిగింది. మొన్నటి వరకు నాలుగో స్థానంలో ఉన్న శ్రద్ధ… తాజాగా దీపికా పదుకొనేను కిందకు నెట్టేసి మూడో స్థానానికి చేరుకుంది. దీపిక నాలుగో స్థానానికి పడిపోయింది. ఇన్స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోయర్లను కలిగిన సెలబ్రిటీగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్నాడు.

కోహ్లీని మొత్తం 82.2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఆ తర్వాతి స్థానంలో 58.1 మిలియన్ల ఫాలోయర్లతో ప్రియాంకచోప్రా కొనసాగుతోంది. మూడో స్థానంలో శ్రద్ధా కపూర్ కు 56.4 మిలియన్ల ఫాలోయర్లు ఉండగా… దీపికా పదుకొనేను 52.3 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. ఈ బ్యూటీ ‘సాహో’ తర్వాత మరో పెద్ద ప్రాజెక్ట్ లో ఛాన్స్ కొట్టేసింది. విశాల్ పురియా దర్శకత్వం వహించనున్న చిత్రంలో ‘నాగిని’గా అలరించబోతోంది. దివంగత శ్రీదేవి గతంలో నటించిన ‘నాగిని’ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి నిఖిల్ ద్వివేది నిర్మాతగా వ్యవహరించబోతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!