
టాలీవుడ్ నటుడు, ర్యాపర్ నోయల్ మంగళవారం ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్ చెప్పాడు. భార్య ఎస్తర్ నుంచి తాను విడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఇప్పటికే డివోర్స్ కోసం దరఖాస్తు చేశామని, ఇన్నాళ్లు కోర్టు నిర్ణయం కోసం ఎదురు చూసినట్లు తెలిపాడు. అభిప్రాయ భేదాల కారణంగా తాము విడిపోతున్నామని, తమ మధ్య ఉన్న అందమైన బంధాన్ని, దాని విలువను కాపాడుకునేందుకు ఇదే సరైన నిర్ణయమని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఎస్తర్ భవిష్యత్ బాగుండాలని, తనకు అంతా మంచే జరగాలని, తను కన్న కలలు నిజం కావాలని ఆకాంక్షించాడు. విడాకుల విషయంలో తన కుటుంబాన్ని గానీ, ఎస్తర్‌ను గానీ ఇబ్బంది పెట్టేలా వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేశాడు. అలాగే కష్ట సమయాల్లో తనకు తోడుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి నోయల్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. సరికొత్త ఆశలతో కొత్త జీవితానికి స్వాగతం పలికేందుకు సిద్ధమైనట్లు పేర్కొన్నాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ నోట్‌ను షేర్ చేశాడు. తెలుగు బిగ్‌బాస్ సీజన్ 4లో నోయెల్ పాల్గొనున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అంతేగాక షో కోసం క్వారంటైన్‌లో ఉన్న అతడికి ఇటీవల కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వార్తలు వినిపించాయి.
I am Officially Divorced.
Wishing Ester Noronha a great new life ahead!
God bless! pic.twitter.com/7vvx84DUge— Noel (@mrnoelsean) September 1, 2020













