HomeTelugu Reviews'శాకుంతలం' మూవీ రివ్యూ

‘శాకుంతలం’ మూవీ రివ్యూ

samantha 2

ప్రముఖ దర్శకుడు గుణ శేఖ‌ర్ ప్రతి సినిమాలో ప్రత్యేకత ఉంటుంది. విజువ‌ల్‌గా ప్రేక్ష‌కుడికి ఓ మంచి అనుభూతినివ్వాల‌నే తాప‌త్ర‌యాన్ని క‌న‌ప‌రుస్తుంటారు గుణ శేఖ‌ర్. రుద్ర‌మ‌దేవి సినిమా తర్వాత ఎనిమిదేళ్ల గ్యాప్‌ తీసుకున్న ఆయన తెర‌కెక్కించిన తాజా చిత్రం ‘శాకుంత‌లం’. ఇదొక పౌరాణిక ప్రేమ గాథ. ఈ సినిమాలో దుష్యంతుడిగా మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహ‌న్‌, శ‌కుంత‌ల‌గా స‌మంత న‌టించారు. దిల్ రాజు ప్రతిష్ఠత్మికంగా ఈ సినిమా ని నిర్మించారు. భారీ హైప్‌తో ఈ రోజు విడుదలైన సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందో చూడాలి.

విశ్వామిత్రుడి త‌పోభంగం కోసం భూమి మీద‌కు వ‌చ్చిన దేవ క‌న్య మేన‌క (మ‌ధుబాల‌). వారి ప్రేమ‌కు గుర్తుగా పుట్టిన పాపను దేవ లోకం తీసుకెళ్ల‌లేక మేన‌క భూమ్మీద‌నే విడిచి పెట్టి వెళ్లిపోతుంది. శాకుంతలం పక్షులు ఆ పాప‌ను కణ్వ మ‌హ‌ర్షి (సచిన్ ఖేడేక‌ర్‌) ఆశ్ర‌మానికి చేరుస్తాయి. పాప‌కు శ‌కుంత‌ల అనే పేరు పెడ‌తాడు మ‌హ‌ర్షి. ఆ ఆశ్ర‌మంలోనే ఆమె పెరిగి పెద్ద‌ద‌వుతుంది. కొన్ని సంత్స‌రాల త‌ర్వాత‌..రాజ్యంలోని ప్ర‌జ‌ల‌ను క్రూర మృగాల బారి నుంచి కాపాడే ప్ర‌య‌త్నంలో దుష్యంత మ‌హారాజు (దేవ్ మోహ‌న్‌) క‌ణ్వ మ‌హ‌ర్షి ఆశ్ర‌మంలోకి అడుగు పెడ‌తాడు. అక్క‌డ శ‌కుంత‌ల (స‌మంత‌)ను చూసి మ‌న‌సు పారేసుకుంటాడు. ఆమె కూడా మ‌హారాజు ప్రేమ‌లో ప‌డిపోతుంది. ఇద్ద‌రూ గాంధ‌ర్వ వివాహంతో ఒక్క‌ట‌వుతారు.

samantha 1

కొన్నాళ్ల‌కు దుష్యంతుడు త‌న రాజ్యానికి వెళుతూ త్వ‌ర‌లోనే తాను తిరిగి వ‌స్తాన‌ని, రాణిగా ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేస్తాన‌ని శ‌కుంత‌ల‌కు మాటిస్తాడు. త‌మ ప్రేమ‌కు గుర్తుకు త‌న ఉంగ‌రాన్నిస్తాడు. ఇది జ‌రిగిన కొన్ని రోజుల‌కు క‌ణ్వ మ‌హ‌ర్షి ఆశ్ర‌మానికి దుర్వాస మ‌హా ముని(మోహ‌న్‌బాబు) వస్తాడు. అప్ప‌టికే గ‌ర్భ‌వ‌తి అయిన శ‌కుంత‌ల‌ భ‌ర్త రాక కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురు చూస్తుంటుంది. దుర్వాస‌ మ‌హా ముని రాక‌ను గుర్తించ‌దు. దాంతో ఆయ‌న‌కు కోపం వ‌స్తుంది. దుష్యంతుడు ఆమెను మ‌ర‌చిపోతాడ‌ని శాపం ఇచ్చేసి వెళ్లిపోతాడు. దుష్యంతుడు రాక‌పోయేస‌రికి క‌ణ్వ మ‌హ‌ర్షి ఆమెను రాజ్యానికి పంపిస్తాడు. శాపం కార‌ణంగా శ‌కుంత‌ల‌ను దుష్యంత‌డు గుర్తించడు. ఆమెకు కొలువులో అవ‌మానం జ‌రుగుతుంది. చివ‌ర‌కు శ‌కుంత‌లం ఏం చేస్తుంది? దుష్యంతుడు, శ‌కుంత‌ల ఎలా కలుస్తారు? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

శాకుంత‌లంను ఆధారంగా చేసుకుని శాకుంత‌లం సినిమాను తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు గుణశేఖ‌ర్‌. దీనికి త‌న సినిమాటిక్ లిబ‌ర్టీని జోడించారు. ఓ పౌరాణిక ప్రేమ క‌థ‌ను విజువ‌ల్ వండ‌ర్‌గా త్రీడీ చేయాల‌నుకోవ‌టం నిజంగా సాహ‌స‌మే. ఎన్నో వ్య‌య ప్ర‌యాస‌ల‌కోర్చి సినిమాను తెర‌కెక్కించారు డైరెక్ట‌ర్ గుణ శేఖ‌ర్‌. అయితే ప్రేమ కావ్యాన్ని వెండితెర‌పై ఆవిష్క‌రించిన‌ప్పుడు అందులో బ‌ల‌మైన ఎమోష‌న్స్ క‌చ్చితంగా ఉండాల్సిందే. లేకుంటే అవి ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ కావు.

samantha

దుష్యంతుడు, శ‌కుంత‌ల మ‌ధ్య దర్శకుడు చూపించాల‌నుకున్న ప్రేమలో ఆ క‌నెక్టింగ్ పాయింట్ మిస్ అయ్యింది. గుణ శేఖర్ త్రీడీలో హిమాలయాల అందాలను చక్కగా ఆవిష్క‌రించారు. శ‌కుంత‌లతో అక్క‌డి జంతువులు స్నేహంగా ఉండే సంద‌ర్భంలో వాటిని త్రీడీ టెక్నాల‌జీతో బాగా చూపించారు. అలాగే దుష్యంతుడు, శ‌కుంత‌ల ఎదురుప‌డే స‌న్నివేశం కూడా బావుంది. అలాగే దుష్యంతుడి రాజ్యాన్ని చూపించే క్ర‌మంలో ఆ భారీ త‌నాన్ని కూడా చ‌క్క‌గా ఆవిష్క‌రించారు. అలాగే మ‌ధ్య‌లో చూపించిన అసుర జాతితో దుష్యంతుడి పోరాటం, దుర్వాసుడి పాత్ర‌కు సంబంధించిన ఎపిసోడ్ అన్నీ బావున్నాయి. ఇక చివ‌ర‌లో చూపించే అల్లు అర్హ ఎంట్రీ, ఆమె న‌ట‌న ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది.

శకుంత‌ల పాత్ర‌లో స‌మంత పెర్ఫామెన్స్ ప‌రంగా ఒదిగిపోయే ప్ర‌య‌త్న‌మైతే చేసింది. కానీ ఈ పాత్రకు ఆమె సెట్‌ కాలేదు అనే భావ‌న ప్రేక్ష‌కుడికి కలుగుతుంది. దుష్యంతుడిగా దేవ్ మోహ‌న్ లుక్ బావుంది. దుర్వాసుడిగా మోహ‌న్ బాబు కనిపించింది కొద్ది సేపే అయిన త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు. స‌చిన్ ఖేడేక‌ర్‌, జిస్సు సేన్ గుప్తా, అన‌న్య నాగ‌ళ్ల‌, గౌత‌మి త‌దిత‌రులు వారి పాత్రల ప‌రిధుల మేర‌కు న‌టించారు. గుణ శేఖ‌ర్ విజువ‌ల్స్‌ను గొప్ప‌గా ఆవిష్క‌రించాల‌నే త‌ప‌న కనిపించింది. మ‌ణిశ‌ర్మ సంగీతం, నేప‌థ్య సంగీతం చాలా బావున్నాయి. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ బావున్నాయి. త్రీడీ, విజువల్ ఎఫెక్ట్స్ బావున్నాయి. నిర్మాణ విలువ‌లు బావున్నాయి.

టైటిల్‌ :శాకుంతలం
నటీనటులు: సమంత, దేవ్ మోహన్, మోహన్ బాబు,సచిన్ ఖేడేఖర్,అల్లు అర్హ తదితరులు
దర్శకత్వం: గుణ శేఖర్
నిర్మాత: నీలిమ గుణ-దిల్ రాజు

చివరిగా: ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్‌ కాని ‘శాకుంతలం’

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu