శూర్పణఖలా మారిన కాజల్‌.. ‘సీత’ టీజర్‌

యువ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజల్‌ అగర్వాల్‌ జంటగా నటించిన సినిమా ‘సీత’. తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ విడుదలైంది. ‘నాకు సాయం చెయ్యి.. నన్ను పెళ్లి చేసుకుని..’ అంటూ విలన్‌ పాత్రలో నటించిన సోనూ సూద్‌.. కాజల్‌తో అంటాడు. ఇందుకు కాజల్‌.. ‘ఈ పెళ్లి పర్మనెంట్‌ అటాచ్‌మెంట్స్‌ నాకు వర్కవుట్‌ కావు’ అని సమాధానమిస్తున్న సన్నివేశాలతో టీజర్‌ మొదలవుతుంది. ‘మట్టికొట్టుకుపోతావే.. నువ్వు సీతవు కాదే.. శూర్పణఖవి..’ అంటూ కాజల్‌ను ఓ మహిళ తిడుతుంటే.. ఇందుకు కాజల్‌ ‘థాంక్యూ’ అనడం ఫన్నీగా ఉంది. ఇందులో శ్రీనివాస్‌ చిన్నపిల్లాడిలా ప్రవర్తించడం నవ్వులు పూయిస్తోంది. కాజల్‌-బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రాబోతున్న రెండో చిత్రమిది. గతంలో వీరిద్దరూ ‘కవచం’ అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ ఫలితాలు అందుకుంది. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు. అనిల్‌ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్‌ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.