
టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమా పింక్ సినిమాకు రీమేక్‌గా వస్తుంది. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. అయితే పవన్ ఈ సినిమా తరువాత డైరెక్టర్ క్రిష్‌తో మరో సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసింది. అయితే ఈ సినిమాలో పవన్ మొగలాయిల కథ చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా మొగలాయిల కాలం నాటి కథ అని.. సినిమా అంతా కోహినూర్ వజ్రం చుట్టూ కథ నడుస్తుందని ఇందులో పవన్ ఒక బందిపోటు పాత్రలో కనిపించబోతున్నాడు అని సమాచారం. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మరో వార్త కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ ను ఓ కీలక పాత్రలో నటించబోతున్నారట! అయితే కార్తికేయన్ ‘రెమో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక పవన్ సినిమాలో కార్తికేయన్ నటించడానికి సంబంధించిన అని ఒప్పందాలు కూడా పూర్తయ్యాయి అని తెలుస్తుంది. ఈ విషయం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.













