లారెన్స్ ‘శివలింగ’ పాటలు సిద్ధం!

కొరియోగ్రాప‌ర్‌, డైరెక్ట‌ర్, హీరోగా త‌న‌దైన గుర్తింపు తెచ్చుకున్న లారెన్స్ తాజాగా ఇప్పుడు పి.వాసు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తున్న ‘శివ‌లింగ’ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీగా ఉన్నారు. క‌న్న‌డ సూప‌ర్‌స్టార్ శివ‌రాజ్‌కుమార్ న‌టించిన శివ‌లింగ చిత్రాన్ని అదే టైటిల్ తో రీమేక్‌గా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో అభిషేక్ ఫిలింస్ పతాకంపై రమేష్ పి. పిళ్లై నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే విడుద‌లైన టీజ‌ర్ లైక్ ల‌తో యూ ట్యూబ్ లో దూసుకుపోతుంది. పోస్ట‌ర్ల తో క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు లారెన్స్ .

తాజాగా సినిమా ఆడియోను ఈ నెల 27 న రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ ”కథే హీరోగా కన్నడ లో బ్లాక్ బస్టర్ అయిన చిత్రం ‘శివలింగ ‘. పి.వాసు గారి చంద్రముఖి, లారెన్స్ కాంచన , గంగ చిత్రాలను మించిన కథ, కథనాలతో హార్రర్ ఎంటర్ టైనర్ గా శివలింగ తెరకెక్కుతోంది. ప్ర‌స్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. టీజ‌ర్ , పోస్ట‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈనెల 27న ఆడియో, అలాగే సినిమాను ఫిబ్రవరి లో విడుదల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. హార్రర్ కాన్సెప్ట్ ల పరంగా శివలింగ నెక్ట్స్ లెవెల్ లొ ఉండే చిత్రమని” అన్నారు.