జాక్‌పాట్‌లాంటిది.. జ్యోతిక ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసిన సూర్య

హీరోయిన్‌ జ్యోతిక, రేవతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘జాక్‌పాట్‌’. కల్యాణ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. జ్యోతిక భర్త, నటుడు సూర్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను సూర్య మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. ‘జాక్‌పాట్‌’ ఫస్ట్‌లుక్‌ ఇదిగో.. యాక్షన్‌తో కూడిన ఫన్‌ రైడ్‌కు సిద్ధంగా ఉండండి. జ్యోతిక, రేవతి ఇద్దరూ ఈ సినిమాలో నటించడం మనకు జాక్‌పాట్‌లాంటిది’ అని సూర్య ట్వీట్‌ చేశారు. ఈ ఫస్ట్‌లుక్‌ చూసిన బాలీవుడ్‌ నటుడు రితేష్‌ దేశ్‌ముఖ్‌.. ‘లుక్‌ సూపర్‌గా ఉంది‌’ అని రిప్లై ఇచ్చారు. దీనికి సూర్య ప్రతిస్పందిస్తూ.. ‘ధన్యవాదాలు (నవ్వుతున్న ఎమోజీ).. నేను చేయగల్గిన స్టంట్స్‌ అన్నీ ఆమె చేసింది’ అంటూ ఆశ్చర్యంగా నోరుమూసిపెట్టుకుని ఉన్న ఎమోజీని షేర్‌ చేశారు.

సూర్య ‘ఎన్జీకే’ సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నారు. సెల్వరాఘవన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తున్నారు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ముఖ్య పాత్ర పోషించారు. సోమవారం సాయంత్రం విడుదల చేసిన ఈ చిత్రం ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. మే 31న చిత్రం విడుదల కాబోతోంది