‘ఇస్మార్ట్‌’ వాయిదా

క్రికెట్‌ ప్రపంచకప్‌ ఫైనల్స్‌ ఉన్న నేపథ్యంలో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ విడుదలను వాయిదా వేసినట్లు మూవీ యూనిట్‌ ప్రకటించింది. ఈ చిత్రం రామ్‌ హీరోగా నటించాడు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్‌, నభా నటేశ్‌ హీరోయిన్‌లు. పూరీ కనెక్ట్స్‌ పతాకంపై పూరీ, ఛార్మి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్‌ మాస్‌ హీరోగా నటించారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌లో ఆయన పాత్ర, డైలాగ్‌ డెలివరీ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. పూరీ-రామ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రాన్ని వచ్చే నెల 12న విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. అయితే ప్రపంచ కప్‌ ఫైనల్స్‌ ఉండటం వల్ల విడుదల తేదీని వాయిదా వేసినట్లు నిర్మాత ఛార్మి శనివారం పేర్కొన్నారు. ఇప్పుడు చిత్రం జులై 18న విడుదల కాబోతోందని తెలిపారు. ‘మామ తేదీ మారింది. కానీ గదే తోపు.. గదే ఊపు’ అని రామ్‌ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ స్టైల్‌లో ఈ సందర్భంగా ట్వీట్‌ చేశారు.