మీనా కూతురుకి మరో అవకాశం!

ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీనా కూతురు ఇటీవల విజయ్ నటించిన ‘తేరి’ సినిమాలో ద్వారా బాల నటిగా పరిచయమైంది. ఈ సినిమాలో ఆమె నటన అందరినీ మెప్పించింది. దాదాపు ఈ సినిమాలో ఆమె నలభై నిమిషాల పాటు కనిపించి అందరినీ అలరించింది. అయితే ఇప్పుడు నైనికకు మరో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. మలయాళం సినిమాకు రీమేక్ గా వస్తున్న
తమిళ చిత్రం ‘రాస్కెల్’ లో నైనిక కనిపించబోతుంది.

ఇందులో కూడా ఆమె పాత్ర నిడివి ఎక్కువనే తెలుస్తుంది. దీంతో మీనా తన కూతురుని చూసుకొని తెగ ముచ్చటపడిపోతుంది. ఈ సినిమాలో అరవింద్ స్వామి, అమలాపాల్ లు జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.