
టాలీవుడ్ ప్రస్తుతం శ్రీలీల ట్రెండ్ నడుస్తుంది. ఏ హీరోతో .. ఏ సెట్లో చూసినా, ఆ షూటింగులో ఆమెనే కనిపిస్తోంది. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల ‘ధమాకా’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది, దీంతో ఆమె క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ఇప్పటికే ఆమె మహేశ్ బాబు, రామ్, నితిన్, వైష్ణవ్ తేజ్, నవీన్ పోలిశెట్టి సరసన కథానాయికగా శ్రీలీల నటిస్తోంది.
బాలకృష్ణ – అనిల్ రావిపూడి సినిమాలో, బాలయ్యకి కూతురు పాత్రలో కనిపించనుంది. ఇక సముద్రఖనితో పవన్ చేస్తున్న సినిమాలోని స్పెషల్ సాంగ్ లోను ఆమెనే సందడి చేయనుంది. ఇక తాజాగా ఈ బ్యూటీ విజయ్ దేవరకొండకు జంటగా నటించనున్నట్లు టాక్. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి సినిమా చేయనున్నాడు.

సితార బ్యానర్లో ఈ సినిమా… ‘ఖుషి’ తరువాత ప్రారంభం కానుంది. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటించే అవకాశం దక్కింది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. ఈ అమ్మడు జోష్.. విజయ్ యాటిట్యూడ్ జోడైతే సినిమా ఓ రెంజ్‌లో ఉంటుందో చూడాలి మరి.
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు













