HomeTelugu Trendingకారు ధ్వంసం ఫిర్యాదు చేసిన.. శ్రీరెడ్డి

కారు ధ్వంసం ఫిర్యాదు చేసిన.. శ్రీరెడ్డి

7 1
వివాదస్పద నటి శ్రీరెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. టాలీవుడ్, కోలీవుడ్‌ ప్రముఖులపై మీటూ ఆరోపణలు చేసి కలకలం సృష్టించిన శ్రీరెడ్డి తెలుగులో అవకాశాలు లేకపోవడంతో చెన్నైకి మకాం మార్చారు. ప్రస్తుతం స్తానిక వలసరవాక్కం, అన్భునగర్‌లోని ఒక ప్లాట్‌లో నివసిస్తున్నారు. కాగా ఇటీవల తన ఫేస్‌బుక్‌ ఖాతాలో తాను ఉంటున్న ఇంటి సమీపంలో నటి తమన్న నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ను నిర్వహిస్తున్నారనీ, ఆ యూనిట్‌ గోల పడలేకపోతున్నానని పేర్కొన్నారు. వారితో మాట్లాడి ఈ సమస్యకు పుల్‌స్టాప్‌ పెట్టాలనుకుంటున్నట్లు తెలిపారు.

కాగా, గత రెండు రోజుల క్రితం నటి శ్రీరెడ్డి స్థానిక కోయంబేడు పోలీస్‌స్టేషన్‌లో ఒక ఫిర్యాదు చేశారు. అందులో తాను ఉంటున్న ఇంటి సమీపంలో విశ్రాంతి పోలీస్‌ అధికారి బంగ్లా ఉందని, అందులో గత కొన్ని రోజులుగా సినిమా షూటింగ్‌ జరుగుతోందని తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో పలు కార్లను నిలుపుతున్నారని చెప్పారు. తాను సోమవారం బయటకు వెళ్లి రాత్రి తిరిగి రాగా తన ఇంటి ముందు ఒక వాహనం నిలిపి ఉండటంతో దాన్ని బయట పెట్టానని పేర్కొన్నారు.

ఆ తరువాత కొంచెం సేపటికి వచ్చి చూస్తే తన ఖరీదైన ఆడి కారుకు గీతలు గీసి ధ్వంసం చేసి ఉండటం చూశానని తెలిపారు. షూటింగ్‌ చేస్తున్న చిత్ర కార్యనిర్వాహకుడు మనోజ్‌పై అనుమానం ఉందని పేర్కొన్నారు. సంఘటనపై విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో కేసును నమోదు చేసుకున్న కోయంబేడు ఇన్‌స్పెక్టర్‌ మాదేశ్వరన్‌ విచారణ జరుపుతున్నారు. ఆ ప్రాంతంలో నిఘా కెమెరాలను పరిశీలిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!