నన్ను చూసి నవ్వుతావా? అనుభవిస్తావ్.. కీర్తికి శాపనార్ధాలు పెడుతున్న శ్రీరెడ్డి

కాస్టింగ్‌ కౌచ్‌ వివాదం తెరపైకి తెచ్చిన నటి శ్రీరెడ్డికి కోపం వచ్చిందట.. తాజాగా ఆమె సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్ ‘మహానటి’ కీర్తి సురేష్‌ తనను హేళన చేసిందంటూ ఆమెపై మండిపడుతోంది శ్రీరెడ్డి. ఇంతలా శ్రీరెడ్డి హర్ట్ అవడానికి కారణం ఏంటంటే.. ఇటీవలే విశాల్, కీర్తి సురేష్ నటించిన ‘పందెం కోడి 2’ (సందెకోళి 2) ఆడియో వేడుకలో శ్రీరెడ్డిని ఉద్దేశించి నటుడు విశాల్ ఆసక్తికర కామెంట్ చేశారు. ఆ సందర్భంలో పక్కనే ఉన్న కీర్తీ సురేష్ నవ్వడమే తన కోపానికి కారణం అంటూ శాపనార్ధాలు పెట్టేస్తుంది శ్రీరెడ్డి.

అయితే ఆ ఆడియో వేడుకలో విశాల్‌.. శ్రీరెడ్డి తమిళంలో సినిమాలు చేయడం మంచిదే. వివాదాలకు దూరంగా సినిమాతో బిజీ అయితే అందరికీ మంచిదే. కానీ ఆమెతో సినిమాలు చేసే వాళ్లు సేఫ్టీ కోసం కెమెరాలు పెట్టుకుని కాస్త జాగ్రత్తగా ఉండాలి. దీనివల్ల ఆమె కూడా సేఫ్ అయినట్లే అంటూ కామెంట్ చేశారు. ఈ సందర్భంలో కీర్తి సురేష్ నవ్వుతూ తనను అవమానించారంటూ ఆమెపై ఫైర్ అవుతోంది శ్రీరెడ్డి. ‘సినిమా ఫీల్డ్ అన్నీ మంచి రోజులే ఉండవు. ఇప్పుడు స్టార్ హీరోయిన్ హోదా ఉందని రెచ్చిపోతే.. ఒక్కడో ఒక చోట కింద పడటం ఖాయం. ఏదో రోజున నువ్వూ ఆ బాధను తెలుసుకుంటావ్. నన్ను చూసిన నవ్విన నీ వెకిలి నవ్వును ఎప్పటికీ గుర్తు ఉంచుకుంటా’ అంటూ హాట్ కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి.