నన్ను తిట్టినోళ్లందరికి అదే గతి.. మురళీ మోహన్‌పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

వివాదాస్పద నటి శ్రీరెడ్డి.. కాస్టింగ్ కౌచ్ దగ్గర మొదలు పెట్టి.. వరుస పెట్టి తనకు వ్యతిరేకంగా మాట్లాడిన టాలీవుడ్ ప్రముఖుల్ని టార్గెట్ చేస్తూ వస్తోంది. మూడు రోజులుగా డైరెక్టర్‌ తేజపై వరుసగా బాంబులు పేలుస్తున్న ఈ వివాదాస్పద నటి.. తాజాగా సీనియర్ నటుడు మురళీ మోహన్‌‌పై విరుచుకుపడింది. అనారోగ్యంతో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న మురళీ మోహన్‌పై నోరు పారేసుకుంది. వంకర మాటలు మాట్లాడితే.. దేవుడు అన్ని వంచేస్తాడంటూ శాపనార్థాలు పెట్టింది.

శ్రీరెడ్డి తన పోస్ట్‌లో ‘రియల్ ఎస్టేట్ భూమి కాదు కాపాడేది, మంచితనం ఒక్కటే జీవితం లో అన్ని కష్టాలనుంచి కాపాడతది..ఈ మధ్య వెన్నుముక వంగిపోయి ,కాళ్లు వంకర్లు పోయినోయ్ అంటగా మురళి మోహన్ గారు! ఇక నుంచైనా కష్టాల్లో వున్నవాళ్ళని చూసి వంకర వంకర మాటలు మాట్లాడకండి.. దేవుడు అన్ని వంచేస్తాడు..నన్ను తిట్టిన ప్రతి ఒక్కరు ఏదొక రూపంలో అనుభవిస్తున్నారు పాపం.. దేవుడు అనే వాడు ఒకడు ఉన్నాడు కర్మ తిరిగి అప్ప చెప్పటానికి ! ఏది ఏమైనా తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నా ‘ చివర్లో ట్విస్ట్ ఇచ్చింది.

మురళీ మోహన్ తన తల్లి అస్థికలు గంగలో కలిపేందుకు అలహాబాద్, వారణాసి వెళ్లి అక్కడ అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించగా.. వెన్నెముకలో సమస్య ఉన్నట్లు తేలింది. దీంతో మురళీమోహన్ సర్జరీ చేయించుకున్నారు. ఆపరేషన్ తర్వాత ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.