HomeTelugu TrendingSSMB 29: మహేష్‌ లుక్స్‌ ఎన్ని ఫైనల్ చేశారో తెలుసా‌!

SSMB 29: మహేష్‌ లుక్స్‌ ఎన్ని ఫైనల్ చేశారో తెలుసా‌!

mahesh babu
SSMB 29: సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు డైరెక్టర్‌ రాజమౌళి కలిసి చేయనున్న సినిమా ‘SSMB 29’ వర్కింగ్‌ టైటిల్. ఈ సినిమా గురించిన అప్డేట్‌ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా గురించి రోజుకో ఒక వార్త సోషల్‌ మీడియాలో ప్రత్యేక్షమౌతుంది. తాజాగా ఈసినిమాకి సంబంధించిన ఓ ఆసక్తిక వార్త వైరల్‌ అవుతుంది. దాంతో మహేష్ ఫ్యాన్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

ఈ సినిమాలో మహేష్ బాబు 8 గెటప్‌లలో కనిపించనున్నారు అని టాక్‌. రాజమౌళి దర్శకత్వం వహించే సినిమాల్లో హీరో గెటప్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకోసం హీరోలు రాత్రి పగలు కష్టపడాలి. ఇప్పుడు మహేష్ బాబు కూడా దానికి కట్టుబడి ఉన్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి లుక్ టెస్ట్ జరుగుతోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 గెటప్‌లను ఇప్పటికే ఖరారు చేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ సినిమాలో మహేష్ బాబు గెటప్ ఏదీ రివీల్ కాలేదు. అందుకే రాజమౌళి కొన్ని షరతులు పెట్టాడని అంటున్నారు. మహేష్ బాబు పబ్లిక్ గా కనిపించ వద్దని రాజమౌళి కండీషన్ పెట్టారట. మామూలుగానే జక్కన్న సినిమాలకు హీరోల దగ్గర నుంచి నాలుగు ఐదేళ్లు కాల్ షీట్స్ తీసుకుంటారు. ఇప్పుడు మహేష్ బాబుతో ఎన్నేళ్లు సినిమా చేస్తారో అని అంటున్నారు ఫ్యాన్స్. ఇక ఈ సినిమాలో హాలీవుడ్ బ్యూటీ నటిస్తున్నారట. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.

ఇటీవలే మహేష్ బాబు గుంటూరు కారంతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాకు మిక్స్ టాక్ రావడంతో మహేష్ నెక్స్ట్ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!