‘డిస్కో రాజా’ విలన్‌గా స్టార్‌ హీరో?

టాలీవుడ్‌ హీరో మాస్ మహారాజ రవితేజ విఐ ఆనంద్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూట్ త్వరలోనే మొదలుకానుంది. ఈ సినిమాకు ‘డిస్కో రాజా’ అనే టైటిల్ అనుకుంటున్నారు. కాగా ఈ సినిమాలో ప్రముఖ స్టార్ నటుడు మాధవన్ ప్రతినాయకుడి పాత్ర చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మాధవన్ ఇంతకుముందు కూడ నాగ చైతన్య యొక్క ‘సవ్యసాచి’ చిత్రంలో విలన్‌ గా కనిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పాయల్ రాజ్ ఫుత్, నాభ నటేష్ లు హీరోయిన్‌లుగా నటించనున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates