లగడపాటి సర్వే ఈ సాయంత్రమే ..ఏపీ ఎన్నికల్లో గెలిచేదెవరు?

ఆంధ్రా అక్టోపస్‌గా, సర్వేల నిపుణుడిగా పేరుగాంచిన లగడపాటి రాజగోపాల్ దేశంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు కొద్దిరోజుల ముందు అమరావతిలో ప్రత్యక్షమయ్యారు. ఈరోజు సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే నిజానికి 19వ తేదీన చివరి విడత ఎన్నికలు ముగిసిన సాయంత్రం 5 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. కానీ లగడపాటి మాత్రం ఇలాంటివేమీ పట్టించుకోకుండా ఒకరోజు ముందే ఏపీ ఎన్నికల ఫలితంపై తన సర్వేను బయటపెట్టనున్నారు.

ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం మే 19న సాయంత్రమే ఫలితాలపై సర్వేలు బయటపెట్టాలి. కానీ లగడపాటి తెలంగాణలో పోలింగ్ కు రెండు రోజుల ముందే కాంగ్రెస్ సారథ్యంలోని మహాకూటమి గెలుస్తుందంటూ ఓ దొంగ సర్వేను బయటపెట్టారు. కానీ లగడపాటి సర్వేకు పూర్తి భిన్నంగా తెలంగాణ ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోగా టీఆర్ఎస్ 89 సీట్లతో అఖండ విజయం సాధించింది. అయితే తన సర్వే అట్టర్ ఫ్లాప్ అయ్యాక మళ్లీ మీడియాకు మొహం చూపించలేదు లగడపాటి. తిరుపతిలో
స్వామి దర్శనం కోసం వచ్చిన సమయంలో ఫలితాలకు పూర్తి భిన్నంగా రిజల్ట్స్ రావడంపై ఎందుకు అలా జరిగిందో చెబుతానని వివరించారు.

CLICK HERE!! For the aha Latest Updates