
Lokesh Kanagaraj Acting Debut:
కోలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్లలో ఒకరైన లోకేష్ కనగరాజ్ ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ కోణంలో కనిపించబోతున్నారని టాక్ నడుస్తోంది. ఆయన దర్శకత్వ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘కైతి’, ‘విక్రమ్’, ‘లియో’ లాంటి బ్లాక్‌బస్టర్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన లోకేష్… ఇప్పుడు రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘కూలీ’ సినిమాతో మరోసారి ఇండస్ట్రీని ఊపేయబోతున్నాడు. ఈ సినిమా ఆగస్టు 14న గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఇక ఇప్పుడు ఆసక్తికరంగా మారుతున్న విషయమేంటంటే, లోకేష్ కనగరాజ్ తానే నటించబోతున్నాడట! అవును… తాజా సమాచారం ప్రకారం, తానే డైరెక్ట్ చేస్తూ తానే హీరోగా కనిపించే ఓ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నాడట. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయట. అయితే ఇంకా అధికారికంగా ఎలాంటి అనౌన్స్‌మెంట్ రాలేదు. కానీ, ఈ న్యూస్ విన్న ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జయిట్ అవుతున్నారు.
లోకేష్ సినిమాలకు ఉన్న క్రేజ్ చూసినవాళ్లకి ఇది పెద్ద సర్ప్రైజ్. ఆయన యాక్టింగ్ ఎలా చేస్తారో చూడాలని కుర్రాళ్లు బాగా ఎగ్జైట్ అవుతున్నారు. అసలే డైరెక్టర్‌గా ట్రెండ్ సెట్ చేస్తున్న లోకేష్… నటుడిగా ఎంటర్ అయితే ఇంక ఇంకొన్ని డైమెన్షన్లు కనిపిస్తాయనడంలో సందేహం లేదు.
ఇక ‘కైతి 2’ కూడా వర్క్‌లో ఉంది. దాంతోపాటు తన యాక్టింగ్ వెంచర్ కూడా వస్తే ఫ్యాన్స్‌కి డబుల్ ధమాకానే. లోకేష్ స్టైల్, యాక్షన్, డార్క థీమ్‌లకి ఫాలోయింగ్ ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఆయన నటిస్తే… ఆ సినిమా టాక్ అటు కోలీవుడ్‌లోనూ ఇటు టాలీవుడ్, బాలీవుడ్‌లోనూ హైపే హైప్.
ఇంకా ఆఫిషియల్ కన్ఫర్మేషన్ వచ్చేదాకా వేచి చూడాల్సిందే. కానీ ఒకసారి లోకేష్ నుంచి క్లారిటీ వచ్చినా… ఆ ప్రాజెక్ట్ కోసం థియేటర్ల ఎదుట క్యూ పడటం ఖాయం!
ALSO READ: SSMB29 సినిమాలో రాజమౌళి స్పెషల్ కామెడీ పాత్రలో మహేష్ బాబు?













