HomeTelugu Trendingనాగార్జున 'వైల్డ్‌డాగ్‌' తెరవెనుక కథ.. వీడియో

నాగార్జున ‘వైల్డ్‌డాగ్‌’ తెరవెనుక కథ.. వీడియో

Story behind wild dog movieఅక్కినేని నాగార్జున హీరోగా నటించిన తాజా చిత్రం ‘వైల్డ్‌డాగ్‌’. అహిషోర్‌ సాల్మన్‌ డైరెక్షన్‌లో తెరకెక్కించారు. నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం(ఏప్రిల్‌ 2)న విడుదలవుతోంది. వాస్తవ సంఘటనలతో తెరకెక్కిన ఈ చిత్రంలో నాగర్జున ఏసీపీ విజయ్‌ వర్మగా నటించాడు. ఇక ఈ సినిమా విడుదల తేది దగ్గరపడుతుండటంతో మూవీ ప్రమోషన్స్‌ స్పీడ్‌ పెంచేసింది చిత్రబృందం. గత చిత్రాలకు భిన్నంగా నాగ్‌ ‘వైల్డ్‌డాగ్‌’ ప్రమోషన్స్‌ చేస్తున్నారు.

ఇక తాజాగా ‘వైల్డ్‌ డాగ్‌’ వెండితెరపై కనిపించేందుకు చిత్రబృందం ఎంత కష్టపడిందో వివరిస్తూ ఓ వీడియోను ప్రేక్షకులతో పంచుకున్నారు. తెర వెనుక క‌థ అంటూ నాగార్జున‌, నిరంజ‌న్ రెడ్డి, అహిషోర్, దియా మీర్జా, సయామీ ఖేర్‌, అలీరెజా, అతుల్‌ కులకర్ణి వంటి నటులు త‌మ అనుభ‌వాల‌ను వివ‌రించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu