బాలయ్యకు విలన్ దొరికాడు!

ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ హీరోలు విలన్ పాత్రల్లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆది, నవీన్ చంద్ర వంటి హీరోలు ఆ కోవలోకే వస్తారు. ఇప్పుడు వారి లిస్ట్ లోకి మరో యంగ్ హీరో చేరబోతున్నాడు. హీరోగా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ బాబు ఆ మధ్య హిందీలో ‘భాఘీ’ అనే సినిమాలో విలన్ గా నటించాడు. ఆ సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే విలన్ గా సుధీర్ బాబుకి మంచి మార్కులు పడ్డాయి. 
ఇప్పుడు ఆ నమ్మకతోనే పూరీ తన సినిమాలో విలన్ గా సుధీర్ బాబుని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పూరీ, బాలయ్య కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో ఓ యంగ్ హీరో విలన్ గా కనిపించనున్నాడనే ప్రచారం ఊపందుకుంది. అప్పటినుండి ఆ యంగ్ హీరో ఎవరనే ఆసక్తి అందరిలో నెలకొంది. తాజా సమాచారం ప్రకారం పూరీ, సుధీర్ బాబుని సంప్రదించడం విలన్ పాత్రను డిజైన్ చేసిన తీరుని వివరించడంతో పాత్ర నచ్చి సుధీర్ కూడా ఓకే చెప్పాడని అంటున్నారు. మరి ఈ సినిమాతో సుధీర్ బాబు విలన్ గా మరిన్ని అవకాశాలు దక్కించుకుంటాడేమో చూడాలి!