‘ఎన్టీఆర్‌’ లో సుమంత్‌ గెటప్స్‌ ఎన్నో తెలుసా!

బాలకృష్ణ కీలక పాత్రలో నటిస్తూ.. నిర్మిస్తున్న బయోపిక్ చిత్రం ‘ఎన్టీఆర్’. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. ఈ చిత్రంలో సుమంత్ అక్కినేని నాగేశ్వరావు పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ పాత్రకు సంబంధించిన స్టిల్ ను ఇటీవలే యూనిట్ రిలీజ్ చేసింది. అక్కినేని పాత్రలో మనవడు సుమంత్ అచ్చంగా సరిపోయాడు. 65 సంవత్సరాల వయసులో అక్కినేని ఎలా ఉన్నారో అలాంటి స్టిల్ అది.

ఇప్పుడు సుమంత్ కు సంబంధించిన మరో వార్త బయటకు వచ్చింది. ఇందులో సుమంత్ మొత్తం 7 నుంచి 8 గెటప్స్ లో కనిపిస్తున్నట్టు సమాచారం. అక్కినేని 30 సంవత్సరాల వయసులో ఉండగా రామారావుతో కలిసి సినిమాల్లో యాక్ట్ చేశారు. అక్కడి నుంచి వారి ప్రయాణం సాగింది. ఇందుకోసం సుమంత్ యుక్త వయసులో ఉన్న ఏఎన్నార్ నుంచి 65 సంవత్సరాల వయసు కలిగిన ఏఎన్నార్ వరకు కనిపించబోతున్నాడు. 30 సంవత్సరాల వయసులో ఉన్న ఏఎన్నార్ స్టిల్ ఎలా ఉందొ బయటకు రిలీజ్ చేయలేదు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతున్నది.